
హార్డ్ వర్క్ చేసి అలసిపోయేకంటే.. స్మార్ట్ వర్క్ చేసి ప్రశాంతంగా ఉండడమే మేలు. స్మార్ట్‌గా పనిచేయాలంటే మార్కెట్లోకి వస్తున్న కొత్త గాడ్జెట్స్ వాడాలి. వాటిలో కొన్ని..
స్మార్ట్ ట్రాష్ క్యాన్
సిటీల్లో ఉండేవాళ్లకు చెత్త డబ్బాతో చెప్పలేనన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పిల్లలు మాటిమాటికీ ట్రాష్ క్యాన్‌ను కింద పడేస్తుంటారు. చెత్త బయటికి వస్తుంటుంది. డబ్బా లీక్ అయినా ఇల్లంతా వాసన వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి చెక్ పెట్టాలంటే.. కాస్త టెక్నాలజీని వాడుకోవాలి. ‘‘టౌన్యూ” కంపెనీ ‘టీ ఎయిర్ ఎక్స్’ పేరుతో స్మార్ట్ ట్రాష్ క్యాన్స్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో సెల్ఫ్ సీలింగ్ టెక్నాలజీ ఉంటుంది. అంటే.. డబ్బాలోని ట్రాష్ బ్యాగ్‌లో వేసిన చెత్తను థర్మోప్లాస్టిక్ సీలింగ్ టెక్నాలజీతో అదే సీల్ చేస్తుంది. కొంచెం కూడా లీకేజీ ఉండదు. ట్రాష్ బ్యాగ్ క్యాన్ నుంచి తీసిన వెంటనే ఆ ప్లేస్‌లోకి కొత్త ట్రాష్ బ్యాగ్ వస్తుంది. ఇందులో ఇన్ఫ్రారెడ్ సెన్సర్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ప్యానెల్ మీద 35 సెం.మీ.లోపు ఏ వస్తువు ఉన్నా మోషన్ సెన్సర్ దాన్ని గుర్తిస్తుంది. వెంటనే డబ్బా మూత తెరుచుకుంటుంది. ఆ తర్వాత డబ్బాలోని లైట్ వెలుగుతుంది. డబ్బాలో చెత్త వేసిన వెంటనే మూత మూసుకుంటుంది. ఈ డబ్బాలో 13.5 లీటర్ల ట్రాక్ బ్యాగ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. 50 రోజుల స్టాండ్‌బై టైంతో వస్తుంది. మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ నుంచి ఛార్జ్ చేయొచ్చు.
ధర: 25,070 రూపాయలు
******************
స్మార్ట్ ఫోన్ అలెక్సా
అమెజాన్ అలెక్సాని చాలామంది వాడుతుంటారు. దానికోసం ప్రత్యేకంగా అమెజాన్ ఎకో డివైజ్‌లను కొనుక్కోవాల్సి వస్తుంది. అయితే, అది కొనుక్కునే పనిలేకుండా టాక్ సాకెట్ డివైజ్‌ని కనెక్ట్ చేసి, స్మార్ట్ ఫోన్‌నే అలెక్సాలా వాడుకోవచ్చు. అన్‌లాక్ చేయకుండా, ఎకో డివైజ్ లేకుండానే అలెక్సాని యాక్సెస్ చేయొచ్చు. టాక్సాకెట్ చాలా చిన్న సైజు డివైజ్. ఫోన్ వెనుక స్టిక్ చేసుకోవచ్చు. దీంతో మ్యూజిక్ ప్లే చేయొచ్చు. అలెక్సాతో కనెక్ట్ చేసిన ఏ డివైజ్‌ని అయినా యాక్సెస్ చేయొచ్చు. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్తుంది. ఈ డివైజ్‌కి రెండు మైక్రోఫోన్లు ఉంటాయి. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఐపీ67 రేటింగ్ వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.
ధర: సుమారు 10,000 రూపాయలు
*********
ఎమోషన్ రోబో
రోబో సినిమాలో చిట్టికి ఫీలింగ్ రావడం వల్లే ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ.. ఈ రోబోకి ఉన్న ఎమోషన్స్ వల్ల కొందరి ప్రాబ్లమ్స్ దూరమవుతున్నాయి. ‘‘ఎలిక్” అనే కంపెనీ ఒక కొత్త రకం రోబోని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. ఈ రోబోలో రకరకాల ఎమోషన్స్ ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. రోబో ముఖం ప్లేస్‌లో ఉన్న స్క్రీన్, చేతుల ద్వారా ఎక్స్ప్రెషన్స్ చూపిస్తుంది. టచ్ ఇంటరాక్షన్ బట్టి దాని ఫీలింగ్స్ చెప్తుంది. తలపై కొట్టినప్పుడు బాధ పడుతుంది. టేబుల్ మీద బలంగా కొడితే భయపడుతుంది. దీంతో కాసేపు టైంపాస్ చేస్తే మనసు రిలాక్స్ అవుతుందని, యాంగ్జైటీ తగ్గుతుందని వాడినవాళ్లు చెప్తున్నారు. యూఎస్బీ టైప్ సీతో ఛార్జ్ చేయొచ్చు. ఫుల్‌గా ఛార్జ్ అయ్యేందుకు గంట టైం పడుతుంది. ఇందులో 3 వాట్స్ స్పీకర్ కూడా ఉంది.
ధర: 11,400 రూపాయలు
****************
మినీ పంప్
వేరే ఊరికి వెకేషన్‌కి వెళ్లినప్పుడు ఎయిర్ పిల్లో, ఎయిర్ బెడ్ లాంటివి తీసుకెళ్తుంటారు. కానీ.. అక్కడికి వెళ్లిన తర్వాత వాటిలో గాలి నింపడం కష్టమవుతుంది. ఆ కష్టం లేకుండా ఉండాలంటే చిన్న పంప్‌ని వెంట తీసుకెళ్లాలి. దీన్ని క్యారీ చేయడం చాలా ఈజీ. ఇది ప్రపంచంలోనే అతి చిన్న పంప్. అల్ట్రా- కాంపాక్ట్ డిజైన్‌తో వచ్చిన ఈ గిగా పంప్ 2.0 చాలా తేలికగా ఉంటుంది. వాక్యూమ్ పంప్‌గా, చీకట్లో టార్చ్లైట్గా కూడా పనిచేస్తుంది. ఇది గాలి నింపడమే కాదు.. తీసేయగలదు కూడా. ఇందులో 1300mAh లిథియం-–అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే పది సింగిల్ ఎయిర్ మ్యాట్రెస్లలో గాలి నింపుతుంది. పది గంటల పాటు లైట్ వెలుగుతుంది. ఎయిర్ మ్యాట్రెస్, పూల్ ఫ్లోట్, స్విమ్మింగ్ రింగ్, యోగా బాల్‌కు ఇది బాగా సరిపోతుంది.
ధర: సుమారు 1,800 రూపాయలు