నిజమైన స్నేహితుడు ఎవరు.. ఎలా గుర్తించాలి

నిజమైన స్నేహితుడు ఎవరు.. ఎలా గుర్తించాలి

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రం లో నిజమైన స్నేహితుడిని  ఎలా గుర్తించాలో కొన్ని సూచనలను అందిఆంచారు.  అంతే కాదు జీవితంలో ఎలాంటి స్వభావం ఉన్న వారికి దూరంగా.. ఎలాంటి వారితో స్నేహం చేయాలో  ఆయన వివరించారు. ఇప్పుడు ఆ విషయాల గురించి తెలుసుకుందాం. . . 

చరిత్ర ప్రకారం చాణక్యుడిని  భారతదేశ కౌటిల్యుడుఅంటారు.  ఈయన రాసిన గ్రంథాలు  జీవితంలో ఆచరించాల్సిన అనేక అంశాలను  తెలియజేస్తాయి.   నిజమైన స్నేహితుడిని ఎలా గుర్తించవచ్చో కూడా చాణక్య నీతి వివరిస్తుంది.నిజమైన స్నేహితుడు ప్రతి విషయంలోనూ మీకు మద్దతు ఇస్తాడు.

నిజమైన స్నేహితుడు :  ..నిజమైన స్నేహితుడు ...బంధువు అంటే మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు... మీ చుట్టూ మీ  శత్రువుల  ఉన్నప్పుడు..మీరు ఆపద సమయాల్లో..  వ్యవహారాల  పరంగా ఇబ్బంది పడేటప్పుడు  సహాయం చేసినవారు మీకు మంచి మిత్రులు .  అంతేకాదు మీరు కాలగమనం చేసిన తరువాత మీ మంచిని గురించి వివరించి చెప్పేవారు.. అన్ని విషయాల్లో  మీకు మద్దతు ఇచ్చే వారితో స్నేహం చేయవచ్చని చాణుక్యుడు తెలిపారు. 


ఎలాంటి వారికి దూరంగా ఉండాలి: .  మీ ముఖం మీద దయతో మాట్లాడుతూ..  మీ వెనుక మీ వ్యవహారాలను చెడగొట్టే వారికి దూరంగా ఉండాలి. మీరు ప్రతి విషయాన్ని వినకుండా మీకు నష్టం వచ్చేలా సలహాలు ఇచ్చే వారికి దూరంగా ఉండాలి. మీరు తెలుసుకోకుండా అలాంటి వారి మాటను పరిగణనలోకి నష్టపోయే అవకాశాలున్నాయని ఆయన వివరించారు.

ఎలాంటి వారిని నమ్మకూడదు:    ఆచార్య చాణక్యుడు చెడు స్నేహితుడిని ఎప్పుడూ నమ్మకూడదని చెబుతున్నాడు. ఆ వ్యక్తి మీకు ఎంత దగ్గరగా ఉన్నా, స్నేహితుడిని ఎప్పుడూ ఎక్కువగా నమ్మకూడదు.  ఎట్టి పరిస్థితిలో  మీ రహస్యాలను వారితో పంచుకోకూడదు. ఎందుకంటే స్నేహం ఎప్పుడైనా చెడిపోతే, వారు మీ రహస్యాలను  మీ శత్రువులకు అందజేసే అవకాశం ఉందని చాణుక్యుడు తెలిపారు.

స్వలాభం కోసం ఇతరులకు హానీ కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారా? లేక మంచిగా ఆలోచిస్తున్నారా? అనేది గమనించాలి. ఒకవేళ ఇతరుల గురించి చెడుగా చెప్తున్నట్లయితే.. అలాంటి వారు మీ ముందు మంచిగా నటిస్తూనే.. వెనుకవైపు మరోలా ఉంటారు. మనిషి పుట్టుకతో వచ్చే గుణాలు.. గిట్టేంత వరకు ఉంటాయని అంటారు. అలాగే చెడ్డవారి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయని చాణక్య పేర్కొన్నారు.