కొత్త గ్యాస్ కనెక్షన్ ధర రూ. 850 పెంపు

కొత్త గ్యాస్ కనెక్షన్ ధర రూ. 850 పెంపు
  • సిలిండర్‌‌కు రూ.750, రెగ్యులేటర్‌‌కు రూ.100 పెంపు 
  • ఇయ్యాల్టి నుంచే అమలులోకి   

హైదరాబాద్‌‌, వెలుగు: కొత్తగా గ్యాస్‌‌ కనెక్షన్‌‌ తీసుకునే వినియోగదారులకు ఆయిల్‌‌ కంపెనీలు షాక్‌‌ ఇచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్ డిపాజిట్ ధరను రూ. 750, రెగ్యులేటర్ ధరను రూ. 100 మేరకు పెంచేశాయి. కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకునేవాళ్లకు రూ.850 అదనంగా భారం పడనుంది. కొత్త ధరలు గురువారం నుంచే అమల్లోకొస్తున్నాయి.  

పెరిగిన ధరలు ఇవే..

ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ డిపాజిట్ ధర రూ.1,450 ఉండగా, దానిని రూ. 2,200కు పెంచారు. 5కిలోల ధర రూ. 800  ఉండగా ఇక నుంచి రూ.1,150కి లభించనుంది. రెగ్యులేటర్ ధర రూ.150 ఉండగా, దానిపై రూ.100 పెంచడంతో  ఇకపై  రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో సిలిండర్‌‌కు, రెగ్యులేటర్‌‌కు కలిపి రూ.1,600 ఉండగా తాజాగా పెరిగిన 2 ధరలతో కలిపి రూ.2,450 వరకు చెల్లించాల్సి ఉంటుంది.