తక్కువ ధరలో కొత్త హీరో ఎలక్ట్రిక్ బైక్స్.. ధర, ఫీచర్స్ ఇవే..

తక్కువ ధరలో కొత్త హీరో ఎలక్ట్రిక్ బైక్స్.. ధర, ఫీచర్స్ ఇవే..

ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశం.. హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుతం ఇండియా మార్కెట్లో 5 ఎలక్ట్రిక్ బైకులను విక్రయిస్తోంది. హీరో ఎలక్ట్రిక్ తాజా బైకుల ధరలు, స్పెసిఫికేషన్లు,ఫీచర్లు, మైలేజ్ ల వివరాలు  మీకోసం..

హీరో ఎలక్ట్రిక్ Eddy: 
హీరో ఎలక్ట్రిక్ Eddy బైక్  2 ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తోంది. ఎల్లో, లైట్ బ్లూ. హైదరాబాద్ లో దీని ధర రూ. 77,805 ( ఆన్ రోడ్ ) జీఎస్టీతో కలిపి. 

హీరో ఎలక్ట్రిక్ ATRIA : 
హీరో ఎలక్ట్రిక్ ATRIA బైక్  కూడా 2 ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తోంది. గ్రే, రెడ్. హైదరాబాద్ లో హీరో ఎలక్ట్రిక్ ATRIA ధర రూ. 78,129 ( ఆన్ రోడ్ ) జీఎస్టీతో కలిపి.

 

హీరో ఎలక్ట్రిక్ NYX HX : 
హీరో ఎలక్ట్రిక్ NYX HX  కూడా 2 ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తోంది. అవి బ్లాక్, సిల్వర్. హైదరాబాద్ లో హీరో ఎలక్ట్రిక్  NYX HX  ఎక్స్ షోరూమ్ ధర రూ. 86వేల687..ఇన్సూరెన్స్, జీఎస్టీ తో కలిసి ఆన్ రోడ్ ధర రూ. 97వేల 080.

హీరో ఎలక్ట్రిక్ OPTIMA HX : 
హీరో ఎలక్ట్రిక్ OPTIMA HX  4 ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తోంది. Maroon, Blue 2.0, Maroon 5.0, Blue 5.0 రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.హైదరాబాద్ లో దీని ధర రూ. 1లక్షా 6వేలు(ఎక్స్ షోరూమ్ ).. జీఎస్టీ, ఇన్సూరెన్స్ కలుపుకొని ఆన్ రోడ్ ధర రూ. లక్షా 12వేల 345.

హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ : 
హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ 3ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తోంది. Blue , Bleige , Matt Black రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో దీని ధర రూ. 86వేల 538(ఎక్స్ షోరూమ్ ).. జీఎస్టీ, ఇన్సూరెన్స్ కలుపుకొని ఆన్ రోడ్ ధర రూ. 96వేల 700.