హ్యుందాయ్ ‘టక్సన్ 2022’ రూ. 27.69 లక్షలు

హ్యుందాయ్ ‘టక్సన్ 2022’ రూ. 27.69 లక్షలు

దక్షిణ కొరియా ఆటోమొబైల్​ కంపెనీ  హ్యుందాయ్ ‘టక్సన్ 2022’ను రూ. 27.69 లక్షలతో లాంచ్​ చేసింది. హెచ్​టీఆర్​ఏసీ టెక్నాలజీ & మల్టీ-టెర్రైన్ మోడ్‌‌‌‌తో కూడిన టాప్- ఎండ్​ మోడల్​ ధర రూ. 34.39 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.  రూ. 50 వేలు చెల్లించి ఈ ఎస్​యూవీని బుక్​ చేసుకోవచ్చు. వెయిటింగ్ పీరియడ్ 8 -- 10 నెలల వరకు ఉంటుంది.  

ఇది పెట్రోల్  డీజిల్ ఇంజన్ ఆప్షన్‌‌లతో వస్తుంది. టక్సన్​లోని 2.0-లీటర్ పెట్రోల్ 150 హెచ్​పీ శక్తిని,  192 ఎన్​ఎం టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్​ 252 హెచ్​పీ శక్తిని,  415 ఎన్​ఎం టార్క్‌‌ను ఇస్తుంది. ఇంజన్ కాన్ఫిగరేషన్‌‌ ఆధారంగా 6-స్పీడ్ లేదా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌‌బాక్స్‌‌తో వస్తుంది. సెక్యూరిటీ కోసం ఏడీఏఎస్​, ముందువెనుకల రాడార్  కెమెరా,  ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్​, ఫార్వర్డ్ కొలిజన్- అవాయిడెన్స్,​ అసిస్టెన్స్​ వంటివి ఉన్నాయి.