.jpg)
ముంబై: ఐపీఎల్ కొత్త సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) సరికొత్త జెర్సీతో బరిలోకి దిగుతోంది. 14వ ఎడిషన్ కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన జెర్సీని ఆ టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బుధవారం అన్వీల్చేశాడు. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చేసే సేవలను గుర్తుచేసే విధంగా ఈ జెర్సీలను ప్రత్యేకంగా రూపొందించారు. షోల్డర్ స్ట్రిప్‌పై ఆర్మీ కలర్‌ను ముద్రించారు. కాగా, స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా ఈ సీజన్లో ఆడటంపై అనుమానాలు తొలగిపోయాయి. లీగ్‌లో పాల్గొనేందుకు బుధవారం ముంబై చేరుకున్న రైనా క్వారంటైన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం చెన్నై వేదికగా ట్రెయినింగ్ చేస్తున్న సీఎస్‌కే ఈ శుక్రవారం ముంబై చేరుకుంటుంది. క్వారంటైన్ అనంతరం రైనా టీమ్‌తో కలవనున్నాడు. ఏప్రిల్10న ముంబై వేదికగా జరిగే మ్యాచ్‌లో సీఎస్‌కే, ఢిల్లీ తలపడనున్నాయి. కానీ, జడేజా ఈ సీజన్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై సీఎస్‌కే క్లారిటీ ఇవ్వడం లేదు.