
Odisha Gold Reserves: గడచిన కొంత కాలంగా బంగారానికి పెరుగుతున్న నిరంతర డిమాండ్ కారణంగా రేట్లు ఆకాశానికి చేరుకున్నాయి. తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఇప్పటికీ లక్ష రూపాయలకు పైనే కొనసాగటంతో సామాన్యుల్లో గోల్డ్ కొనాలనే ఆశలు కలగానే మిగిలిపోతున్నాయి. ఇలాంటి సమయంలో భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో బంగారం నిక్షేపాలను గుర్తించింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. దీంతో రానున్న రోజుల్లో జగన్నాధుకు కొలువైన ఒడిశా రాష్ట్ర ఆర్థిక రూపురేకలు మారిపోతాయని నిపుణులు అంటున్నారు.
ఒడిశా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గోల్డ్ రిజర్వ్స్ ఉన్నట్లు సర్వేలో తేలింది. దీంతో భారతదేశంలో బంగారం మైనింగ్ కి కొత్త హబ్ గా ఈ ప్రాంతం కాబోతోందని తెలుస్తోంది. అయితే ఈ సారి వీటి తవ్వకాలు చేపట్టి బయటకు తీసేందుకు ప్రభుత్వం వేలం ప్రక్రియ ద్వారా ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించొచ్చని తెలుస్తోంది. ఒడిశాలోని దేవ్‌ఘర్, కియోంఝర్, సుందర్‌ఘర్, నబరంగ్‌పూర్, అంగుల్, కోరాపుట్ సహా అనేక ప్రాంతాల్లో గోల్డ్ నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ డిపార్ట్మెంట్ కన్ఫమ్ చేసింది.
ఇక ఇదే సమయంలో మయూర్‌భంజ్, సంబల్‌పూర్, మల్కాన్‌గిరి, బౌధ్ సహా మరికొన్ని ప్రాంతాల్లో బంగారం కోసం అన్వేషణలను కొనసాగిస్తోంది జియోలాజికల్ శాఖ. ఈ గోల్డ్ నిక్షేపాలకు సంబంధించిన సమాచారాన్ని అక్కడి గనుల శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా మార్చి 2025లో శాసనసభలో ధృవీకరించటంతో విషయం బయటకు వచ్చింది.
ALSO READ : తగ్గిన బంగారం..
ప్రస్తుతం ఉన్న ప్రాథమిక అంచనాల ప్రకారం ఆ ప్రాంతంలో 10 మెట్రిక్ టన్నుల నుంచి 20 మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 10వేల నుంచి 20వేల కేజీల మధ్య గోల్డ్ అక్కడి భూమిలో ఉండొచ్చని వెల్లడైంది. వాస్తవానికి భారతీయులకు గోల్డ్ పై ఉన్న ప్రేమ కారణంగా డిమాండ్ కి అనుగుణంగా విదేశాల నుంచి దిగుమతులు కొనసాగుతున్నాయి. ఇక దేశీయంగా ఉత్పత్తి తక్కువగా ఉండటంతో మరోదారి లేక దిగుమతులకు వెళ్లాల్సి వస్తోంది. గత సంవత్సరంలో భారతదేశం దాదాపు 700–800 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది భారతదేశం. ప్రస్తుత ఒడిశాలో గుర్తించబడిన నిక్షేపాలు అక్కడి ఉపాధి అవకాశాలను పెంచుతాయి.