V6 News

డీజీపీతో కొత్త మినిస్టీరియల్‌‌‌‌ స్టాఫ్ సంఘం భేటీ

డీజీపీతో కొత్త మినిస్టీరియల్‌‌‌‌ స్టాఫ్ సంఘం భేటీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మినిస్టీరియల్ స్టాఫ్ సంఘం కొత్త కార్యవర్గ సభ్యులకు డీజీపీ శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అభినందనలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన  ప్రెసిడెంట్‌‌‌‌ ఆర్‌‌‌‌.‌‌‌‌ఉపేందర్ రెడ్డి (సీనియర్ అసిస్టెంట్), వైస్  ప్రెసిడెంట్స్‌‌‌‌ ఎన్‌‌‌‌.రాజేందర్ (సూపరింటెండెంట్), ఎండీ హఫిసొద్దీన్ (సీనియర్ అసిస్టెంట్), సెక్రటరీగా టి. శివరంజని (సీనియర్ అసిస్టెంట్) సహా మొత్తం 14 మందితో కూడిన కార్యవర్గం బుధవారం డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసింది.

ఈ సందర్భంగా డీజీపీ వారికి అభినందనలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కార్యవర్గ సభ్యులు అడిషనల్ డీజీ(లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌), ఐజీ రమేశ్ లను కలిశారు.