రవితేజ నుంచి సంక్రాంతికి రాబోతున్న సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవల ‘బెల్లా బెల్లా’ అనే పాటను విడుదల చేసిన మేకర్స్.. బుధవారం ‘అద్దం ముందు’ అనే మరో పాటను విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ మెలోడియస్ సాంగ్‌ను శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ పాడారు.
‘చల్లగాలి కావాలంటే చందమామను తీసుకొస్తాడే.. సన్నజాజి కావాలంటే సంత మొత్తం మోసుకొస్తాడే.. అడిగింది అందిస్తాడే.. అంతకు మించింది తెచ్చిస్తాడే.. కోరింది తీరుస్తాడే.. వేరే కోరిక నాకింక లేకుండ చేస్తాడే.. అద్దం ముందు నిలబడి అబద్దం చెప్పలేనే.. నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే..” అంటూ చంద్రబోస్ రాసిన సాహిత్యం ఆకట్టుకుంది. యూరప్‌లోని అందమైన లొకేషన్స్ మధ్య శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను చిత్రీకరించారు. రవితేజ, డింపుల్ హయతి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇంప్రెస్ చేసింది.

