V6 News

నాకు నటుడిగా ప్రత్యేకత తీసుకొచ్చేది స్క్రిప్ట్ సెలెక్షనే: హీరో కార్తి

నాకు నటుడిగా ప్రత్యేకత తీసుకొచ్చేది స్క్రిప్ట్ సెలెక్షనే: హీరో కార్తి

హీరో, పాటలు, విలన్, ఫైట్స్‌‌ ఉండే  ఒక పర్ఫెక్ట్‌‌‌‌ మాస్‌‌‌‌ కమర్షియల్‌‌‌‌ స్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ సినిమాలు.. ప్రపంచంలో మన దగ్గర మినహా మరెక్కడా లేవు. ఎయిటీస్‌‌‌‌ నుంచి అవి మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు  మనకు సూపర్ హీరో అనగానే బ్యాట్ మ్యాన్‌‌‌‌, సూపర్ మ్యాన్‌‌‌‌లు గుర్తొస్తారు. కానీ సినిమాలను, పాలిటిక్స్‌‌‌‌ను మార్చేసిన ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌, ఎంజీఆర్‌‌‌‌‌‌‌‌ లాంటి సూపర్ హీరోస్‌‌‌‌ మనకు ఉన్నారు. అప్పట్లో వాళ్ల ఫొటోస్‌‌‌‌ను ఇంట్లో పెట్టుకుని దేవుడిలా ఆరాధించేవారు. ఆ మాస్‌‌‌‌ కమర్షియల్‌‌‌‌ మేనియాను,  వింటేజ్‌‌‌‌ వైబ్‌‌‌‌ను గుర్తు చేసేలా మోడరన్ ప్రెజెంటేషన్‌‌‌‌తో ఈ సినిమా ఉంటుంది. నా వరకూ ఇదొక రిస్కీ ప్రయత్నం. 

ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌, ఎంజీఆర్‌‌‌‌‌‌‌‌ ఒకరి సినిమాలను మరొకరు రీమేక్స్‌‌‌‌ చేయడంతో పాటు ఇద్దరి కెరీర్‌‌‌‌‌‌‌‌లోనూ ఎన్నో పోలికలు ఉన్నాయి. ఈ సినిమా తెలుగు,  తమిళ వెర్షన్స్‌‌‌‌లో వాటిని చూస్తారు. ఇక నలన్‌‌‌‌ కుమారస్వామి గత చిత్రాలు శాడ్ ఎండింగ్‌‌‌‌తో ఉంటాయి. కానీ ఇది హీరో సెంట్రిక్‌‌‌‌గా ఉంటుంది. స్పిరిట్‌‌‌‌ రీడర్‌‌‌‌‌‌‌‌ పాత్ర కోసం కృతిశెట్టి ఎంతో ఎఫర్ట్‌‌‌‌ పెట్టింది. గ్లామర్‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌తోనే కాకుండా నటిగా మెప్పించేందుకు ఆమె ప్రయత్నిస్తోంది. 
పారలల్ వరల్డ్‌‌‌‌లో జరిగే సూపర్ హీరో సినిమా ఇది.  నేను గతంలో పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా పలు చిత్రాల్లో కనిపించా. కానీ ఇందులో పాత్రను దర్శకుడు డిఫరెంట్‌‌‌‌గా డిజైన్ చేశాడు.  ఈ సినిమా కోసం ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశామంటే అందుకు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇచ్చిన సపోర్ట్ కారణం.  

నటుడిగా నాకు ప్రత్యేకత తీసుకొచ్చేది నా స్క్రిప్ట్ సెలెక్షనే. కొత్త తరహా కథలను ఎంచుకోవాలనే ప్రయత్నం నిత్యం చేస్తుంటాను.  అలాగే ఎవరు కొత్త తరహా సినిమా చేసినా మన వంతు ప్రోత్సాహం అందించాలి. లేకుంటే కొత్తగా ప్రయత్నించేవారు ముందడుగు వేయలేరు. నలన్‌‌‌‌ కుమారస్వామి సినిమా చేసి ఎనిమిదేళ్లు అవుతున్నా తన సినిమా కోసం జనం ఎదురుచూస్తున్నారు. అతని ‘సూదు కవ్వమ్‌‌‌‌’ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్‌‌‌‌ ఉన్నారు. ఇలాంటి దర్శకులకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కొత్త తరహా సినిమాలు వస్తాయి. 

కార్తి హీరోగా నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన చిత్రం ‘అన్నగారు వస్తారు’. కృతి శెట్టి హీరోయిన్‌‌‌‌. ఈ నెల 12న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో కార్తి చిత్ర విశేషాలను గురించి ఇలా ముచ్చటించారు.