కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్న క్రమంలో పోలింగ్ జరిగే ప్రాంతాలలో పోలింగ్ రోజున (11.12.2025, 14.12.2025, 17.12.2025) ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలకు ఉపయోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థల భవనాలు, ఇతర భవనాలకు సంబంధించిన కార్యాలయాలకు పోలింగ్కు ముందు రోజు, అలాగే పోలింగ్ రోజు స్థానిక సెలవులు ఉంటాయని పేర్కొన్నారు.
మొదటి విడత ఎన్నికల నిర్వహణ కోసం 10.12.2025(బుధవారం) & 11.12.2025 (గురువారం) స్థానిక సెలవులు, రెండవ విడత ఎన్నికల నిర్వహణ కోసం 13.12.2025 (రెండవ శనివారం), 14.12.2025 (ఆదివారం) సాధారణ సెలవులు, మూడవ విడత ఎన్నికల నిర్వహణ కోసం 16.12.2025 (మంగళవారం) & 17.12.2025 (బుధవారం) స్థానిక సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ రోజున సెలవు వర్తిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
* ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత 20 మండలాల్లో గురువారం పంచాయితీ ఎన్నికల పోలింగ్
* 398 గ్రామ పంచాయతీలకు 20 సర్పంచ్లు ఏకగ్రీవం
* 378 సర్పంచ్ పదవులకు 1524 మంది పోటీ
* 3682 వార్డులకు 1045 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం
* రెండు వార్డులకు దాఖలు కాని నామినేషన్లు
* ఎన్నికల నిర్వహించే 2635 వార్డులకు 7320 మంది అభ్యర్థులు పోటీ
* తొలి విడతలో పోటీలో ఉన్న 8844 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఆరు లక్షల మంది ఓటర్లు

