బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' చివరి అంకానికి చేరుకుంది. రోజు రోజుకు ఊహించని మలుపులతో రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య టఫ్ టాస్కులు, ఎలిమినేషన్ ట్విస్టులతో మరింత ఉత్కంతను పెంచుతున్నారు బిగ్ బాస్. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఇద్దరు బయటకు వెళ్తేనే టాప్ 5 ఫైనల్ బెర్త్‌లు ఖరారవుతాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కోసం రంగం సిద్ధం చేశారు.
అర్ధరాత్రి షాక్!
కళ్యాణ్ మినహా ఈ వారం మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్‌లునామినేషన్లలో ఉన్నారు. టాప్ 5 ఫైనలిస్ట్‌లను ప్రకటించడానికి బిగ్ బాస్ గురువారం మిడ్-వీక్ ఎలిమినేషన్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా బిగ్ బాస్ ఇలాంటి కీలక ఘట్టాలను అర్ధరాత్రి ప్లాన్ చేస్తాడు. కంటెస్టెంట్‌లు ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో వారిని లేపి, ఊహించని షాక్ ఇస్తూ.. షోలో డ్రామాటిక్ మూమెంట్స్‌ను సృష్టిస్తాడు. ఈసారి ఆ షాక్‌కు గురయ్యేది ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది.
ఎలిమినేషన్ లో ఆ ఇద్దరూ..
ఈ మిడ్-వీక్ ఎలిమినేషన్ పూర్తిగా ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగా జరుగుతుందా? లేక ఈ వారం జరుగుతున్న ఇమ్యూనిటీ టాస్కుల ప్రదర్శనను బట్టి నిర్ణయం తీసుకుంటారా? అనేది బిగ్ బాస్ ఇవ్వబోయే పెద్ద ట్విస్ట్. ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రమాదంలో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారిలో సుమన్ శెట్టి , సంజన.. అయితే ఆడియన్స్ ఓట్ల పరంగా చూస్తే, ఈ వారం సుమన్ శెట్టి తక్కువ ఓట్లతో బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంజన ఇమ్యూనిటీ రేసులో వెనకబడింది. అందుకే, టాస్క్ ప్రదర్శన ఆధారంగా ఎలిమినేషన్ జరిగితే, గురువారం రాత్రి సంజన హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. బిగ్ బాస్ ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా, అది కచ్చితంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం ఖాయం.
విన్నర్ రేసులో ఎవరు ముందు?
విన్నర్ టైటిల్ కోసం ప్రధానంగా మూడు పేర్లు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ బలమైన ఫాలోయింగ్‌తో ముందున్నాడు. ఓటింగ్ కూడా బాగా పెరిగింది. తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం హౌస్ లో తనూజ , ఇమ్మాన్యుయేల్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు వస్తున్న సపోర్ట్ ను బట్టి చూస్తే కల్యాణ్‌కే విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది.
ALSO READ : తనూజ చేతిలో కీలుబొమ్మగా కళ్యాణ్ ? ఫైనలిస్ట్ రేసులో ఊహించని ట్విస్ట్‌లు!
ఇక ఈ వారం ఇమ్యూనిటీ టాస్కుల్లో డీమాన్ పవన్ , ఇమ్మాన్యుయేల్ ఎక్కువ పాయింట్లతో సత్తా చాటగా, ఆడియన్స్ ఓటు అప్పీల్ చేసే అవకాశం ఇమ్మాన్యుయేల్‌కు దక్కింది. మరోవైపు, బాల్స్ టాస్క్‌లో తనూజ అగ్రస్థానం, భరణి రెండో స్థానంలో నిలిచారు. పజిల్ టాస్క్‌లోనూ భరణి మొదటి స్థానం, తనూజ రెండో స్థానం దక్కించుకున్నారు. మొత్తానికి, చివరి వారంలో టాస్కులు, గొడవలు, ఎలిమినేషన్ ట్విస్ట్‌లతో బిగ్ బాస్ 9 ఉత్కంఠను తారస్థాయికి చేర్చింది. మరి గంటల్లోనే ఫైనల్ టాప్ 5 ఎవరో తెలిసిపోనుంది.

