V6 News

Bigg Boss 9: తనూజ చేతిలో కీలుబొమ్మగా కళ్యాణ్ ? ఫైనలిస్ట్ రేసులో ఊహించని ట్విస్ట్‌లు!

Bigg Boss 9:  తనూజ చేతిలో కీలుబొమ్మగా కళ్యాణ్ ? ఫైనలిస్ట్ రేసులో ఊహించని ట్విస్ట్‌లు!

బిగ్‌ బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ, టైటిల్ రేసులో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. టాప్-5 ఫైనల్‌ బెర్త్‌ల కోసం కంటెస్టెంట్లు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు.  టాస్క్ లలో పోటీ పడుతున్నారు.  ఈ సీజన్ మొదట్లో టైటిల్ రేసులో తనూజ  ముందుంది. కానీ గత నాలుగైదు వారాల నుంచి ఊహించని విధంగా కళ్యాణ్ దూసుకొచ్చారు. ప్రారంభంలో ఉన్న నెగెటివిటీని పొగొట్టుకుని ..  తన ఆటతీరు, ప్రవర్తనలతో భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. అత్యధిక ఓటింగ్ తో మొదటి ఫైనలిస్ట్ గా నిలిచాడు.

 తనూజ కమాండింగ్!

అయతే ఇప్పుడు కళ్యాణ్ ఆట తీరు మళ్లీ గతి తప్పిందనే విమర్శలు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.  ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ఈ విషయం స్పష్టమైందని టాక్ వినిపిస్తోంది. హౌస్ లో భరణి ఇదే అంశాన్ని బహిరంగంగా ప్రస్తావించారు. "కళ్యాణ్ ఏంటి... ఇంత దారుణంగా అయిపోయాడు. తనూజ కూర్చోమంటే కూర్చొంటున్నాడు, నిలబడు అంటే నిలబడుతున్నాడు. కళ్యాణ్ పై తనూజ కమాండింగ్ ఎక్కువగా అనిపిస్తుంది," అని భరణి వ్యాఖ్యానించారు. మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచిన కళ్యాణ్, ఇప్పుడు తన ఆటను పూర్తిగా తనూజ గెలుపు కోసం పక్కన పెట్టేసి, ఆమె చెప్పినట్లు వింటున్నాడని హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. ఈ కారణంగానే కళ్యాణ్, బిగ్ బాస్ టైటిల్‌కు దూరమవుతున్నాడని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండో ఫైనలిస్ట్ కోసం యుద్ధం

హౌస్‌లో ప్రస్తుతం రెండో ఫైనలిస్ట్ అయ్యేందుకు వరుస టాస్కులు పెడుతున్నారు బిగ్ బాస్. లీడర్ బోర్డులో తక్కువ పాయింట్లు రావడంతో సంజన ఈ ఫైనలిస్ట్ రేసు నుంచి తప్పుకుంది. ప్రస్తుతం డీమాన్ పవన్, ఇమ్మాన్యుయెల్, తనూజ, భరణి, సుమన్ శెట్టి హోరాహోరీగా పోటీ పడుతున్నారు. నామినేషన్ల నుంచి తప్పించుకుని, ఫైనలిస్ట్ అయ్యేందుకు బిగ్ బాస్ పెట్టిన మూడో యుద్ధమే 'పట్టుకో.. పట్టుకో' టాస్క్. ఇందులో కంటెస్టెంట్స్ జంబో ప్యాంట్ ధరించి కదులుతూ, సంచాలకులు విసిరే బాల్స్‌ను ఒడిసిపట్టుకోవాలి. ఎక్కువ బాల్స్ సేకరించిన వారికి ఎక్కువ పాయింట్లు లభిస్తాయి.

ALSO READ : బిగ్ బాస్ ఫినాలే ఫైట్.. టార్గెట్ ఇమ్మూ.. లీస్ట్‌లో ఉండిపోతే హగ్ ఇచ్చి పంపిస్తారా?

టాస్క్ లో సుమన్ కష్టాలు..

ఈ టాస్క్‌కు సంచాలకులుగా కళ్యాణ్, సంజన వ్యవహరించారు. మొదట సంజన ఇమ్మాన్యుయెల్‌కు అనుకూలంగా బాల్స్ విసిరినట్లు కనిపించింది. ఆ తర్వాత కళ్యాణ్ వంతు రాగా, అతను కూడా తనూజ గెలవాలనే ఉద్దేశంతో ఆమెకు ఎక్కువ బాల్స్ విసిరినట్లు ప్రోమోలో స్పష్టమైంది. సుమన్ శెట్టికి బాల్స్ వేస్తున్నప్పుడు, భరణి అడ్డుపడి వాటిని అందుకున్నారు. దీనిపై సుమన్ అభ్యంతరం తెలపగా.. సుమన్ అన్న హైట్ తక్కువగా ఉన్నాడు కదా, అతడికి ఎక్కువ వేస్తే ఏం పోతుంది అని సంజన నిలదీసింది. కళ్యాణ్ మాత్రం భరణి అడ్డుపడుతున్నారని సమర్థించుకున్నాడు. ఈ క్రమంలో ఎత్తు గురించి భరణి లాజిక్స్ మాట్లాడటం, తనూజ ఎప్పటిలాగే వాదించడం హైలైట్‌గా నిలిచాయి.

గొడవలు, స్ట్రాటజీలు, భావోద్వేగాలు రోజురోజుకూ పెరుగుతున్న ఈ చివరి వారంలో, తండ్రీ కూతుళ్లుగా మెలిగిన భరణి, తనూజల మధ్య కూడా వాగ్వాదం జరిగినట్లు లేటెస్ట్ ప్రోమో సూచించింది. అయినప్పటికీ, కళ్యాణ్ ఓట్ అప్పీల్, ఇమ్మాన్యుయెల్ భావోద్వేగ ప్రదర్శన వంటి అంశాలతో బిగ్ బాస్ 9 ఫినాలే వీక్ ప్రేక్షకులకు మరింత ఉత్కంఠను రేపుతోంది.