
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురుమంత్రులకు శాఖలు కేటాయించారు సీఎం కేసీఆర్. హరీశ్ రావుకు ఆర్థిక శాఖను కేటాయించారు. కేటీఆర్ కు ఐటీ, మున్సిపల్, పరిశ్రమలు కేటాయించగా..సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ కేటాయించారు. గంగుల కమాలకర్ కు బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ, సత్యవతి రాథోడ్ కు ఎస్టీ సంక్షేమం, స్త్రీశిశు సంక్షేమం, పువ్వాడ అజయ్ కుమార్ కు రవాణ శాఖలు కేటాయించారు. అలాగే జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖను కేటాయించారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖలు ఉన్నాయి.