
రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఛాంపియన్’. స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. శనివారం పూజాకార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టాడు.
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఈ సినిమాలో రోషన్‌ను కొత్త అవతార్‌లో చూపించేందుకు దర్శకుడు యూనిక్ స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్టు ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. డీవోపీ ఆర్.మధి, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి లాంటి టాప్ టెక్నీషియన్స్ దీనికి పని చేస్తున్నారు.