
పార్లమెంట్ లో ప్రధాని స్పీచ్
- తొమ్మిదేళ్లలో గ్రామాలను కలుపుతూ 4 లక్షల కి.మీ రోడ్లు నిర్మించాం
- తొమ్మిదేళ్లలో నవనిర్మాణం, పేదల సంక్షేమం కోసం శ్రమించాం
- ఈ లోగా భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలి
- మరో 25 ఏళ్లలో స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుంది
- పాత పార్లమెంట్ లో చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి
- రాబోయే రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుంది..దానికి అనుగుణంగా కొత్త భవనం నిర్మించాం
- కొత్త పార్లమెంట్ ను భారతీయులంతా స్వాగతిస్తున్నారు
- ఆధునిక పరిజ్ఞానంతో పార్లమెంట్ కొత్త భవనం నిర్మించాం
- నయా భారత్ నయా లక్ష్యం వైపు వెళ్తోంది
- ప్రజాస్వామ్యంలో ముందుకెళ్తూనే ఉండాలి
- అమృత్ కాల్ లో అన్ని కఠిన సవాళ్లను అధిగమిస్తాం
- ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిది
- చోళ సామ్రాజ్య చరిత్రలో సెంగో ల్ కు ప్రత్యేక స్థానం ఉంది
- సేవ,కర్తవ్యానికి సెంగోల్ ప్రతీక
- మీడియాలో కథనాల ద్వారా సెంగో ల్ కు గౌరవం పెరిగింది
- సెంగోల్ గురించి మీడియాలో అనేక కథనాలు వచ్చాయి
- భారత్ కత్త లక్ష్యాలను ఎంచుకుంది
- ప్రపంచం మొత్తం నవ భారత్ వైపు చూస్తోంది
- భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుంది
- ఆత్మనిర్భర భారత్ కు పార్లమెంట్ సాక్షిగా నిలుస్తుంది
- కొత్త పార్లమెంట్, కొత్త భారత్ కు కొత్త జోష్ తీసుకొచ్చింది
- లోక్ సభలో సెంగోల్ అందరికి ప్రేరణ
- పవిత్రమైన సెంగోల్ ను పార్లమెంట్ లో ప్రతిష్టించాం
- భారత్ ముందుకెళ్తే ప్రపంచం ముందుకెళ్తుంది
- ఆధునికి భారత్ కు పార్లమెంట్ కొత్త భవనం అద్దం పడుతోంది
- ఇది కేవలం భవనం మాత్రమే కాదు..140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక
- ఈ రోజు చరిత్రలో నిలిచిపోతోంది
- స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత పార్లమెంట్ కొత్త భవనం నిర్మించుకున్నం
- 140 కోట్ల భారతీయుల కల సాకారం అయ్యింది
- ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం
- సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ
- రూ.75 విశిష్ట నాణెం విడుదల చేసిన మోడీ
- మోడీ దృఢ సకల్పం వల్లే తక్కువ టైమ్ లో కొత్త పార్లమెంట్ భవనం పూర్తయింది
- భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలం - ఓం బిర్లా
- సభలో మాట్లాడుతున్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
- పార్లమెంట్ లో లఘుచిత్రాల ప్రదర్శన
- అనేక చారిత్రక ఘటనలకు పార్లమెంట్ భవనం సాక్షిగా నిలిచింది
- కొత్త పార్లమెంట్ భవనం దేశ సాంస్కృతిక వైభవానికి ప్రతీక
- సభ్యల కోసం ఎన్నో అధునిక వసతులు కల్పించారు
- సభలో ప్రసంగిస్తున్న రాజ్యసభ వైస్ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్
- సభకు హాజరైన ప్రధాని మోడీ, స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, ఎంపీలు
- నూతన పార్లమెంట్ లో ప్రారంభమైన సభ
- హాజరైన మాజీ రాష్ట్రపతి కోవింద్, మాజీ ప్రధాని దేవేగౌడ
- సభలో నిలబడి మోడీకి సభ్యుల అభివాదం
- ప్రధాని మోడీకి స్వాగతం పలికిన సభ్యులు
- కొనసాగుతోన్న కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం రెండో సెషన్
- రెండు సెషన్లుగా ప్రారంభోత్సవ కార్యక్రమం
- ఉదయం 7.15 నుంచి 9.30 గంటలకు వరకు మొదటి సెషన్
- ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనున్న రెండో సెషన్
- నూతన పార్లమెంట్ భవనంలో ముగిసిన సర్వమత ధర్మ ప్రార్థనలు
- నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్, హాజరుకానీ కేసీఆర్
- కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
- నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
- పార్లమెంట్ భవనంలోకి వెళ్లే ముందు ప్రధాని మోదీ సెంగోల్‌కు నమస్కరించారు.
-
పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సెంగోల్‌ను ఏర్పాటు చేయగా, ఆయనతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు.
-
తమిళనాడు సెంగోల్‌ను ప్రధాని మోదీకి అందించారు. 18 మఠాల మఠాధిపతులు ఆయనను ఆశీర్వదించారు.
- పార్లమెంట్ భవన నిర్మాణ కార్మికులను ప్రధాని మోడీ సన్మానించారు.. కార్మికులను శాలువతో సత్కరించి వారికి జ్ఞాపికలను అందజేశారు మోడీ
- లోక్ సభలోని స్పీకర్ పోడియం పక్కన సెంగోల్ ను ప్రధాని మోడీ ప్రతిష్టించారు. సభలో భాజాభజంత్రీలు, వేదపండితుల ఆశీర్వచనాల మధ్య సెంగోల్ ను ప్రతిష్టించారు.
- హోమంతో ప్రారంభమైన పార్లమెంట్ ప్రారంభోత్సవం .. గణపతి హోమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.
- కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని మోడీ చేరుకున్నారు. మరికాసేపట్లో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు.
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ 2023 మే 28 ఆదివారం ప్రారంభించనున్నారు. దాదాపు 25 పార్టీల ప్రతినిధులు, పలు రాష్ట్రాల సీఎంలతో సహా పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు.
కొత్త పార్లమెంట్ విశేషాలు
- 2020 డిసెంబర్ 10న ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకస్థాపన చేశారు.
- పాత పార్లమెంట్ భవనంలో లోక్‌సభ 545, రాజ్యసభలో 250 మంది సభ్యులు కూర్చునే సీటింగ్ కెపాసిటి ఉండేది.
- కొత్త భననంలో లోక్‌సభ 888 మంది సభ్యులు, రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునే సీటింట్ కెపాసిటీని ఏర్పాటు చేశారు.
- కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో 64,500 చదరపు మీటర్లు స్థలంలో నిర్మించారు.
- సెంట్రల్ విస్తా భవన సముదాయ వరుసక్రమంలో త్రిభుజాకారంలో పార్లమెంట్ భవన నిర్మాణం చేపట్టారు. దీనిలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, రాజ్యాంగ బద్ధ సంస్థల కార్యాలయాలు ఉంటాయి.
- కొత్త లోక్‌సభ ఛాంబర్‌ను జాతీయ పక్షి నెమలి ఆకృతిలో నిర్మించారు.
- రాజ్యసభ ఛాంబర్‌ను జాతీయ పుష్పం ఆకృతిలో నిర్మించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో నిర్మాణం భారతీయ నిర్మాణ వారసత్వం ప్రతిబింబించేలా నిర్మించినట్లు తెలుస్తోంది.