పార్లమెంట్ బిల్డింగ్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి: మహేశ్వర్ రాజ్

పార్లమెంట్ బిల్డింగ్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి: మహేశ్వర్ రాజ్

కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని.. పార్లమెంట్ భవన నామకరణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మహేశ్వర్ రాజ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని చెప్పారు. కానీ దీనిపై ప్రధాని మోడీ నుంచి ఇంత వరకు స్పందన రాలేదన్నారు.

రేపు హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం నుంచి బహదూర్ పుర వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు మహేశ్వర్ రాజ్ వెల్లడించారు. అనంతరం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసి ఈ అంశంపై మాట్లాడతామని మహేశ్వర్ రాజ్ తెలిపారు.