కొత్త పార్లమెంట్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ సమాఖ్య డిమాండ్

కొత్త పార్లమెంట్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ సమాఖ్య డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్మిస్తున్న పార్లమెంట్ బిల్డింగ్​కు అంబేడ్కర్ పేరు పెట్టాలని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు, నూతన పార్లమెంట్ భవన నామకరణ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్ మహేశ్వర రాజ్ డిమాండ్ చేశారు. సోమవారం ఎస్సీ, ఎస్టీ సమాఖ్య  ఆధ్వర్యంలో ఢిల్లీ లోని రాంలీలా మైదాన్ లో సభ నిర్వహించారు. దీనికి తెలంగాణ నుంచి మహేశ్వర్ రాజ్, పెద్ద సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు నేతలు హాజరయ్యారు.

పార్లమెంట్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల గవర్నర్​లు, సీఎంలు, రాజ్య సభ, లోక్ సభ ఎంపీలు, ఉన్నతాధికారులకు లేఖలు రాసినట్లు మహేశ్వర రాజ్ చెప్పారు. దీంతో భయపడ్డ కేసీఆర్, ముందుగానే తెలంగాణ సెక్రటేరియెట్ కు అంబేడ్కర్ పేరు పెడుతున్నట్లు ప్రకటించారన్నారు. మోడీ సర్కార్ జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో  బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. అలాగే, బీసీ రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగ రంగాలు, స్థానిక సంస్థల ఎన్నికలలో 27 శాతం నుంచి 50శాతం పెంచాలని డిమాండ్ చేశారు.