వాషింగ్టన్: అమెరికాకు చెందిన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్ స్టీన్ ఎస్టేట్లో ప్రముఖులు దిగిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, వ్యాపారవేత్తలు, స్టీవ్ బానన్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి ప్రముఖులు ఎప్ స్టీన్తో, అమ్మాయిలతో కలిసి దిగిన ఫొటోలను ‘హౌస్ ఓవర్ సైట్ కమిటీ’లో సభ్యులుగా ఉన్న డెమోక్రటిక్ నేతలు రిలీజ్ చేశారు.
వీటి లో ట్రంప్ కొందరు అమ్మాయిలతో కలిసి ఉన్న ఫొటోతోపాటు ఎప్ స్టీన్తో ఉన్నప్పటి ఫొటో కూడా ఉంది. ట్రంప్ బ్రాండ్ పేరుతో 4.5 డాలర్ల ధరతో అమ్మకానికి పెట్టిన కండోమ్ ప్యాకెట్ల ఫొటో కూడా బయటకొచ్చింది. అయితే, ఎప్ స్టీన్ ఎస్టేట్ నుంచి మొత్తం 95 వేల ఫొటోలు అందాయని, కానీ.. ట్రంప్ సహా ఇతర ప్రముఖులెవరూ తప్పు చేస్తున్నట్టుగా ఎక్కడా లేదని కమిటీలోని రిపబ్లికన్ సభ్యులు చెప్పారు.

