గతేడాది భైరవం, కిష్కింధపురి లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయా సినిమాలకు సంబంధించిన మేకర్స్ బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ కొత్త పోస్టర్స్, అప్‌డేట్స్‌ను అందించారు. సాయి శ్రీనివాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘హైందవ’. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమాను మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. హీరో బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంది.
మాస్ లుక్‌లో ఉన్న సాయి శ్రీనివాస్ సగం నీటిలో మునిగి ఉన్న ఒక పురాతన కట్టడంపై నిలబడి, అతని శరీరం నీటితో తడిసి, రక్తపు మరకలతో కనిపించడం ఆసక్తికరంగా ఉంది. ఒక చేతిలో రక్తంతో తడిసిన గొడ్డలిని పట్టుకుని, మరో చేతిలో మండుతున్న ముసుగు, అతని వెనుక మెరిసే కళ్ళు భారీ కోరలతో ఉన్న ఒక పెద్ద వరాహం కనిపించడం మరింత ఇంటెన్సిటీని పెంచింది.
ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుందని, త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. మరోవైపు సాయి శ్రీనివాస్ హీరోగా లోకమాన్య దర్శకత్వంలో వేణు దోనేపూడి నిర్మిస్తున్న ‘రామమ్’ చిత్రం నుంచి ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే ‘టైసన్ నాయుడు’ మూవీ టీమ్ కూడా సాయి శ్రీనివాస్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేసింది.
