స్టాక్ మార్కెట్ లో రికార్డుల మోత

స్టాక్ మార్కెట్ లో రికార్డుల మోత

67  వేల పైన సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. 20 వేలకు చేరువవుతున్న నిఫ్టీ


ముంబై: మరోసెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ మార్కెట్‌‌లో కొత్త రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు క్రియేట్ అయ్యాయి. నిఫ్టీ, సెన్సెక్స్ బుధవారం కొత్త గరిష్టాలకు చేరుకున్నాయి.   గ్లోబల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కదులుతున్న వేళ ఇండియన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోస్ కొనసాగుతున్నాయి.  రిలయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐటీసీ షేర్లు పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కదలడంతో  30 షేర్లున్న సెన్సెక్స్ బుధవారం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 302 పాయింట్లు (0.45 శాతం) లాభపడింది. ఈ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 67,097 దగ్గర  క్లోజింగ్ బేసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైని నమోదు చేసింది. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి   19,833 దగ్గర ముగియగా, ఇంట్రాడేలో 19,852 లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ఆల్ టైమ్ హై ని నమోదు చేసింది. ‘ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు హై లెవెల్లో ఉన్నప్పటికీ ఇండియన్ ఎకానమీపై ఇన్వెస్టర్లలో కాన్ఫిడెన్స్ తగ్గడం లేదు.   మాక్రోఎకనామిక్ డేటా మెరుగ్గా ఉండడం, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోస్ నిలకడగా కొనసాగుతుండడంతో బ్రాడ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ర్యాలీ కనిపిస్తోంది. బుధవారం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపించినా, మార్కెట్ కాన్ఫిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికవరీ అయ్యింది. ఆటో, ఐటీ మినహా మిగిలిన అన్ని సెక్టార్లలో బయ్యింగ్ కనిపించింది. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ తగ్గుతుందనే అంచనాలతో గ్లోబల్ మార్కెట్లు కూడా ర్యాలీ చేయడం లోకల్ మార్కెట్లకు కలిసొచ్చింది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. సియోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టోక్యో, షాంఘై మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు బుధవారం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లాభాల్లో ముగియగా, హాంకాంగ్ మార్కెట్ నష్టపోయింది. యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మెజార్టీ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కదిలాయి. డాలర్ మారకంలో రూపాయి 82.09 దగ్గర సెటిలయ్యింది.

 

గత కొన్నేళ్లలో సెన్సెక్స్ రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు..

  • సెన్సెక్స్ బుధవారం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 67,097 దగ్గర సరికొత్త క్లోజింగ్ హై ని నమోదు చేయగా, ఇంట్రాడేలో 67,171 దగ్గర ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్ హైని  రికార్డ్ చేసింది.
  • ఈ నెల 18 న 66,795 దగ్గర ఫ్రెష్ క్లోజింగ్ హైని నమోదు చేయగా,  మొదటిసారిగా అదే రోజు ఇంట్రాడేలో 67 వేల మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది.
  • ఈ నెల 17 న 66,590 దగ్గర క్లోజింగ్ బేసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ఇంట్రాడేలో 66,656 దగ్గర ఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్ హై నమోదయ్యాయి.
  • ఈ నెల 14 న మొదటిసారిగా సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 66 వేల పైన క్లోజయ్యింది. ఇంట్రాడేలో 66,160 దగ్గర ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్ హైని నమోదు చేసింది. ఈ నెల 13 న  మొదటిసారిగా ఇంట్రాడేలో 66 వేల మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టచ్ చేసింది.
  • ఈ నెల 3 న మొదటిసారిగా 65 వేల పైన క్లోజయ్యింది. ఈ ఏడాది జూన్ 30 న మొదటిసారిగా 64 వేల మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇంట్రాడేలో టచ్ చేసింది. 
  • కిందటేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30 న సెన్సెక్స్ మొదటిసారిగా 63 వేల మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21, 2021 న 62 వేల 
  • మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇంట్రాడేలో క్రాస్ చేసింది. అదే రోజు  61 వేల మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దాటింది. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 24, 2021 న 60 వేల మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మొదటిసారిగా ఇంట్రాడేలో టచ్ చేసింది. ఈ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే 
  • క్లోజయ్యింది.