ఫ్రెంచ్ ఫ్రైస్ తో ప్రమాదం.. పరిశోధనల్లో వెల్లడి

ఫ్రెంచ్ ఫ్రైస్ తో ప్రమాదం.. పరిశోధనల్లో వెల్లడి

ఫుడీస్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ కు యమ క్రేజ్ ఉంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో బయటికి వెళ్లినా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ పెట్టాల్సిందే. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ లొట్టలేసుకొని తినే ఫుడ్ ఇది. అయితే, తరచూ ఫ్రెంచ్ ఫ్రైస్ తినేవాళ్లకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చైనా పరిశోధనలో తేలింది. 

జంక్ ఫుడ్ ఏదైనా ఆరోగ్యానికి ప్రమాదమే. అయితే, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తినడంవల్ల డిప్రెషన్, యాంగ్జైంటీ వంటి లక్షణాలు వస్తాయని పరిశోధకులు చెప్తున్న మాట. నూనెలో ఎక్కువగా వేగించిన ఆహార పదార్థాలేవైనా డిప్రెషన్ లాంటి వ్యాధులకు దారితీస్తాయని చెప్తున్నారు. 

మామూలుగా ఉద్యోగం, ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల అయితే 7 శాతం మందికే యాంగ్జైటీ డిప్రెషన్ వస్తుంది. కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి వేగించిన ఆహార పదార్థాలు తినడం వల్ల 12 శాతం మందికి ఈ వ్యాది వస్తుందని పరిశోధకులు చెప్తున్న మాట.