ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్​... లాభమా.. నష్టమా..

ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్​... లాభమా.. నష్టమా..

2024  ఫిబ్రవరి నెల మరో మూడు రోజుల్లో ( జనవరి 29నుంచి) ప్రారంభం కానుంది.  ప్రతి ఏడాది మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.  మరో నెలలో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో ఫిబ్రవరిలో  కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొన్ని నియమాలలో మార్పులు జరగనున్నాయి.అవి నేరుగా మీ పై ప్రభావం చూపుతాయి. మరి ఏయేం మార్పులు ఉంటాయో.. వాటి వల్ల మీకు లాభమా? నష్టమా? తెలుసుకుందాం.

  • ఫిబ్రవరి 1 నుంచి ఐఎంపీఎస్ (IMPS) నిబంధనలు కూడా మారనున్నాయి. ఐఎంపీఎస్ .. అంటే ఒక బ్యాంకు కొన్ని నిమిషాల్లో మరో బ్యాంకుకు డబ్బును పంపే సర్వీస్. ఫిబ్రవరి 1 నుంచి లబ్ధిదారుడి వివరాలు లేకుండానే రూ.5 లక్షల వరకు నగదు బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎన్‌పీసీఐ అక్టోబర్ 31న సర్క్యులర్ జారీ చేసింది.

  • ఫిబ్రవరి నెలలో మీరు సావరిన్ గోల్డ్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎస్జీబీ 2023-24 సిరీస్ 4ను తీసుకురానుంది. ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 16 వరకు సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. వీటిలో ఇన్వెస్ట్‌ చేస్తే రాబడి ఎక్కువగా ఉంటుంది.

  •  ఫాస్టాగ్ నిబంధనలను మార్చింది. ఫాస్టాగ్ కేవైసీని తప్పనిసరి చేసింది. కేవైసీ పూర్తి చేయడానికి జనవరి 31 చివరి తేదీ. కేవైసీ పూర్తిచేయకపోతే.. లేకపోతే ఫిబ్రవరి 1 నుంచి బ్యాంకులు ఫాస్టాగ్‌ను డీయాక్టివేట్ చేసి బ్లాక్ లిస్ట్‌లో పెట్టనున్నాయి. ఫాస్టాగ్ లో కేవైసీ పూర్తికాని వాహనాలను డీయాక్టివేట్ చేస్తారు.

  • నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద పెట్టుబడి పెట్టిన నిధులను పాక్షికంగా విత్ డ్రా చేసుకునేందుకు నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రత్యేకమైన కారణాలంటేనే విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. తొలిసారి ఇళ్లు కొనేవారు కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం ప్రత్యేక హోమ్ లోన్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. దీని కింద గృహ రుణాలపై కస్టమర్లకు 65 బేసిస్ పాయింట్ల ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజులో కూడా రిబేట్ బెనిఫిట్ ఉంది. జనవరి 31తో ప్రచారం ముగియనుంది. అందువల్ల ఇళ్ల కొనుగోలుపై ఫిబ్రవరి 1 నుంచి ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.