తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : యాదాద్రి జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : యాదాద్రి జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే

యాదాద్రి, వెలుగు:  సెకెండ్​ ఫేజ్​ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం ఏడు గంటలకే పోలింగ్​ ప్రారంభమైంది. చలి తీవ్రంగా ఉన్నా.. ఓటర్లు ఉదయమే సెంటర్లకు వచ్చేశారు. పోలింగ్​ ప్రారంభమైన రెండు గంటల్లోనే 20 శాతం మంది ఓటు  హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్​ ముగిసేంత వరకూ సెంటర్లను కలెక్టర్​ హనుమంతరావు, అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కరరావు పర్యవేక్షించారు. కాగా కొన్ని సెంటర్లకు మామిడి తోరణాలు కట్టి అలంకరించారు. 

అదేవిధంగా సెంటర్​కు వచ్చిన వృద్ధ ఓటర్లకు మొక్క అందించి స్వాగతం పలికారు. డీసీపీ ఆకాంక్ష్​ యాదవ్​ పర్యవేక్షణలో పోలీసులు గస్తీ నిర్వహించారు. బీబీనగర్​ మండలం రాఘవాపురంలో రీ కౌంటింగ్​ చేయగా కాంగ్రెస్​ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. పోచంపల్లి మండలం భీమనపల్లిలోనూ రీ కౌంటింగ్​ నిర్వహించగా కాంగ్రెస్​ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. సర్పంచ్​ల ఫలితం వెలువడిన పంచాయతీల్లో ఉప సర్పంచ్​ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో కొన్ని పంచాయతీల్లో వార్డు మెంబర్లు ఎవరికి వారు తనకే కావాలంటూ కోరుతున్నారు. 

యాదాద్రి జిల్లాలోని ఐదు మండలాల్లో పంచాయతీల్లో గెలిచిన అభ్యర్థులు వీళ్లే.

భూదాన్ పోచంపల్లి మండలంలో.. 

జంగారెడ్డి (అంతమ్మగూడెం), కర్నాటి వరలక్ష్మి (భీమన్‌పల్లి), సువర్ణ (దంతూరు), జంగయ్య (దేశ్‌ముఖి), రవీందర్ (ధర్మారెడ్డిపల్లి), జంగయ్య (దోతిగూడెం), నరేశ్ (గౌస్‌కొండ), వెంకటేశ్ (ఇంద్రియాల), గీతా యాదవ్ (జగత్‌పల్లి), లింగస్వామి (జలాల్‌పూర్), ఆర్ల కావ్య (జిబ్లక్‌పల్లి), కాసుల అంజయ్య (జూలూరు), శోభ (కనుముక్కుల), నర్మద (కప్రాయిపల్లి), లక్ష్మయ్య (మెహర్‌నగర్), లత (పెద్దగూడెం), బాలకృష్ణ (పెద్ద రావులపల్లి), మహాలక్ష్మి (పిల్లాయిపల్లి), రేణమ్మ (రామలింగంపల్లి), బొక్క మల్లారెడ్డి (శివారెడ్డిగూడెం), శ్రీనివాస్ (వంకమామిడి) ఎన్నికయ్యారు.

భువనగిరి మండలంలో 

నరేందర్ (ఆకుతోటబావి తండా), సురేశ్ (అనాజీపురం), నాగరాణి (అనంతారం), ఎడ్ల చిన్న వెంకటరెడ్డి (బీఎన్ తిమ్మాపురం), శ్రీరామ్ (బాలంపల్లి), జంగయ్య (బండ సోమారం), భిక్షపతి (బస్వాపురం), రమాదేవి (బొల్లేపల్లి), లలిత (చందుపట్ల), అంజయ్య (చీమలకొండూరు), సుమలత (గంగాసానిపల్లి), గీత (గౌస్ నగర్), సువర్ణ (హన్మాపురం), లూర్తయ్య (జమ్మాపురం), మనోహర (కేసారం), శివానంద్ (కూనూరు), కళ (మన్నెవారిపంపు), కృష్ణ (ముత్తిరెడ్డి గూడెం), హేమలత (ముత్స్యాలపల్లి), రాఘవేందర్ రెడ్డి (నాగిరెడ్డిపల్లి), అరుణ (నమాత్‌పల్లి), గిరిజ (నందనం), భానోతు జ్యోతి (పచ్చర్లబోడు తండా), మల్లిఖార్జున్ రెడ్డి (పెంచికల్ పహాడ్), కొలను రవికళారెడ్డి (రామచంద్రాపురం), సునీత (రెడ్డి నాయక్ తండా), పడాల వెంకటేశ్వర్లు (సిరివేణికుంట), ధనమ్మ (సూరెపల్లి), సంతోష్ (తాజ్‌పూర్), పాండు (తుక్కాపూర్), శంకరయ్య (వీరవెళ్లి), శిరీష (వడాయిగూడెం), తోటకూరి మానస (వడపర్తి), యశోద (ఎర్రంబెల్లి) ఎన్నికయ్యారు.

బీబీనగర్ మండలంలో

 రాజు (అన్నంపట్ల), లత (బట్టుగూడెం), వాణి (బ్రాహ్మణపల్లి), శ్రీకాంత్ (చిన్నరావులపల్లి), పార్వతి (గొల్లగూడెం), అలివేలుమంగ (గూడూరు), ధరావత్ గోపి నాయక్ (గుర్రాలదండి), హేమలత (జైనేపల్లి), మహేందర్ (జమిలాపేట్), మనోహర (జంపల్లి), జమున (జియాపల్లి), గోవింద్ (జియాపల్లి తండా), పాండురంగం (కొండమడుగు), భాను (లక్ష్మిదేవిగూడెం), వెంకటరెడ్డి (మాదారం), అనిత (మహదేవ్‌పూర్), కీలేందర్ (ముక్తా అనంతారం), నరేశ్ (ముగ్దుంపల్లి), సురేశ్ (మీదితండా), శాంతి (నీలతండా), స్వర్ణలత (నెమరగోముల), అంజయ్య (పడమటి సోమారం), నీల (పెద్దపలుగు తండా), శ్రీకాంత్ (రాఘవాపూర్), శృతి (రహీంఖాన్ గూడ), రమేశ్ (రాయరావుపేట), వెంకటేశ్ (రావిపహాడ్), జిల్కపల్లి సరళ (రుద్రవెళ్లి), నాగలక్ష్మి (వెంకిర్యాల), అప్పిరెడ్డి బలరామ్ రెడ్డి (పల్లెగూడెం), భానోతు శంకర్ (రావిపహాడ్ తండా), భానోతు గోపి (రామునిగుండ్ల తండా), భానోతు సరోజ (ఎర్రబేటి తండా) ఎన్నికయ్యారు.

రామన్నపేట మండలంలో 

వరలక్ష్మి (బీ తుర్కపల్లి), మాధవి (బాచుప్పల), సాయికుమార్ (బోగారం), నర్సింహా (దుబ్బాక), చందన (ఇస్కిళ్ల), సరోజ (జనంపల్లి), యాదమ్మ (కొత్తగూడెం), సత్తయ్య (కుంకుడుపాముల), సునీత (లక్ష్మాపురం), గోపాల్ రెడ్డి (నేర్నేముల), శ్రీనివాస్ (పల్లివాడ), సత్యనారాయణ (రామన్నపేట), మధుసూదన్ (శోభనాద్రిపురం), రామకృష్ణ (ఉత్తటూరు), రాధ (వెల్లంకి), జానకి (ఎన్నారం), బమిడిక శ్రీను (సూరారం), నారపాక మాధవి (నిధాన్‌పల్లి) ఎన్నికయ్యారు.

వలిగొండ మండలంలో 

తిరుమలేశ్ (ఎం తుర్కపల్లి), బుచ్చయ్య (మొగిలిపాక), దానయ్య (ప్రొద్దటూరు), జ్యోతి (నర్సాయిగూడెం), అనిత (వెల్వర్తి), సంధ్యారాణి (సుంకిశాల), పృథ్వీ (గోపరాజుపల్లి), సలేహా (నాగారం), మంజుల (కేర్చిపల్లి), ఉప్పలయ్య (నర్పాపూర్), శ్రీనివాస్ (ఎదుళ్లగూడెం), గోపి (దాసిరెడ్డిగూడెం), ఇందిరాదేవి (గోకారం), కమలమ్మ (వెంకటాపురం), నర్సింహా (గుర్నాథపల్లి), రాములు (లోతుకుంట), రమణమ్మ (వర్కట్‌పల్లి), వెంకటేశం (వేములకొండ), మానస (చిత్తాపూర్), లలిత (సంగెం), కరుణశ్రీ (పహిల్వాన్‌పురం), రాణి (గొల్లేపల్లి), బుచ్చిరెడ్డి (కంచన్‌పల్లి), లింగస్వామి (లింగరాజుపల్లి), ముత్యాలు (అర్రూరు), జావీద్ పాషా (దుప్పెల్లి), మంజుల (జాలుకాల్వ), సరస్వతి (ముద్దాపురం), యాదమ్మ (మాందాపురం), జంగమ్మ (నాతాళ్లగూడెం), బాలస్వామి (రెడ్లరేపాక), మమత (టేకుల సోమారం), వేణుగోపాల్ రెడ్డి (అక్కంపల్లి) ఎన్నికయ్యారు.