- మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్తో 7.5 శాతం వడ్డీ పొందే అవకాశం
- కనీసం రూ.1000 గరిష్టంగా రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు
- మార్చి 31, 2025 వరకు అవకాశం
బిజినెస్ డెస్క్, వెలుగు: మహిళలు, ఆడపిల్లల కోసం ప్రభుత్వం ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌లలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయడానికి అనుమతిస్తారు. ఈ ఏడాది బడ్జెట్లో ఈ స్కీమ్‌ను ప్రకటించగా, ఏప్రిల్ 1 నుంచి దేశంలోని బ్యాంకులు, 1.59 లక్షల పోస్ట్ ఆఫీస్‌లలో అందుబాటులోకి వచ్చింది.
ఈ స్కీమ్ గురించి..
1. మహిళలు తమకు తాముగా లేదా మైనర్ గర్ల్స్ తరపున గార్డియన్స్ ఈ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్చి 31, 2025 లోపు మహిళా సమ్మాన్ సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవాలి.
2. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ కింద కనిష్టంగా రూ. 1,000, గరిష్టంగా రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు.
3. ఈ స్కీమ్ కింద ఏడాదికి 7.5% వడ్డీని పొందొ చ్చు. వడ్డీని మూడు నెలలకొకసారి లెక్కిస్తారు. వడ్డీ అమౌంట్‌ను ఇన్వెస్టర్ అకౌంట్‌కు యాడ్ చేస్తారు.
4. డిపాజిట్ చేసిన డేట్ నుంచి రెండేళ్లలో మెచ్యూరిటీ ఉంటుంది. ఫామ్–2 సబ్మిట్ చేయడం ద్వారా అమౌంట్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు.
5. ఇన్వెస్ట్ చేసిన ఏడాది తర్వాత 40 % వరకు అమౌంట్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఫామ్–3 సబ్మిట్ చేయడం ద్వారా కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
6. మెచ్యూరిటీకి ముందు అకౌంట్‌ను క్లోజ్ చేయడానికి కుదరదు. కానీ, కొన్ని సందర్భాల్లో అకౌంట్‌ను పర్మనెంట్‌గా క్లోజ్ చేసుకోవచ్చు. అవి.. అకౌంట్ హోల్డర్ చనిపోయినప్పుడు లేదా అకౌంట్ హోల్డర్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ నమ్మినప్పుడు. అకౌంట్‌ను పర్మినెంట్‌గా క్లోజ్ చేసుకుంటే అప్పటి వరకు ఎంత వడ్డీ వస్తుందో అంత చెల్లిస్తారు. కాని, డిపాజిట్ చేసిన ఆరు నెలల తర్వాతనే అకౌంట్‌ను క్లోజ్ చేసుకోవడానికి వీలుంటుంది.
వడ్డీ 2% తక్కువ వస్తుంది.
7. బ్యాంకుల ఎఫ్డీలపై, ఇతర స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లపై వస్తున్న వడ్డీ కంటే ఈ స్కీమ్‌లో ఎక్కువ వడ్డీ దొరుకుతుంది.
8. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌కు సెక్షన్ 80 సీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. అందువలన
ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు కూడా ట్యాక్స్
బెనిఫిట్స్ పొందొచ్చు.
ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే?
1. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి దగ్గరలోని బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి, ఫామ్-1 తీసుకోవాలి.
2. అవసరమైన వివరాలతో ఫామ్ నిం పాలి. ఐడెంటిటీ ప్రూఫ్ , అడ్రస్ ప్రూఫ్‌ల ను అప్లికేషన్‌తో పాటు సబ్మిట్ చేయాలి.
3. ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి.
4. చెక్ లేదా క్యాష్ ద్వారా ఫండ్స్‌ను డిపాజిట్ చేయాలి.
5. ఆ తర్వాత ఇన్వెస్టర్ పేరున ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు.