ముస్లిం మైనార్టీల కొత్త స్కీమ్స్‌‌‌‌ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ జారీ

ముస్లిం మైనార్టీల కొత్త స్కీమ్స్‌‌‌‌ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ జారీ
  • రూరల్‌‌‌‌లో ఇన్‌‌‌‌కమ్ లిమిట్ రూ.1.5 లక్షలు, అర్బన్‌‌‌‌లో రూ.2 లక్షలు
  • ఏజ్ లిమిట్ 21 నుంచి 55 ఏండ్లు
  • గతంలో లబ్ధి పొందినోళ్లు అనర్హులు 

హైదరాబాద్, వెలుగు: -ముస్లిం మైనార్టీల కోసం కొత్తగా తెచ్చిన ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’, ‘రేవంతన్న కా సహారా.. మిస్కీన్‌‌‌‌ కే లియే’ స్కీమ్స్‌‌‌‌కు సంబంధించిన గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హుల ఎంపిక, దరఖాస్తు విధానం తదితర అంశాలను తెలియజేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫకీర్, దూదేకుల, ఇతర పేద ముస్లిం మైనారిటీ వర్గాల కోసం ఈ రెండు పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

 ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ కింద ముస్లిం వితంతువులు, విడాకులు పొందినోళ్లు,  అనాథ మహిళలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఈ పథకం కింద వీధి వ్యాపారాలు మొదలైన వాటిని ప్రోత్సహిస్తుంది. ఇక ‘రేవంతన్న కా సహారా.. మిస్కీన్‌‌‌‌ కే లియే’ స్కీమ్ కింద మోపెడ్లు, బైక్‌‌‌‌లు, ఈ-–బైక్‌‌‌‌లు అందించనుంది. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.లక్ష గ్రాంట్ ఇవ్వనుంది.  

ఇవీ అర్హతలు.. 

దరఖాస్తుదారులు ఫకీర్, దూదేకుల, ఇతర పేద ముస్లిం వర్గాలకు చెందినవారై ఉండాలి. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించరాదు. వయసు 21 నుంచి 55 ఏండ్ల మధ్య ఉండాలి. అడ్రస్​ప్రూఫ్​కోసం ఆధార్ కార్డు, రేషన్​కార్డ్.. ఏజ్​ప్రూఫ్​కోసం ఓటరు గుర్తింపు కార్డు/ఆధార్ కార్డు తప్పనిసరి. వెహికల్స్​ఒక కుటుంబానికి ఒక్కటే ఇస్తారు. దరఖాస్తుదారునికి తప్పనిసరిగా డ్రైవింగ్​ లైసెన్స్​ఉండాలి. 

గత ఐదేండ్లలో మైనారిటీ కార్పొరేషన్​లేదా ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన వ్యక్తులు, కుటుంబం ఈ పథకానికి అనర్హులు. tgobmmsnew.cgg.gov.in వెబ్‌‌‌‌సైట్​ద్వారా వచ్చే నెల 6వ తేదీలోపు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలి.