కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

కొత్త సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17 ఉదయం 11.30 గంటల నుంచి 12.30గంటల మధ్య కార్యక్రమం నిర్వహించేందుకు వేద పండితులు ముహూర్తం నిర్ణయించారు. ఆ రోజున సీఎం కేసీఆర్ డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. 

17న ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీయాగం, సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు లలన్ సింగ్, డా. బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితరులు హాజరుకానున్నారు. సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.