జూన్ 27 లోపు కొత్త సెక్రటేరియట్ కు శంకుస్థాపన

జూన్ 27 లోపు కొత్త సెక్రటేరియట్ కు శంకుస్థాపన

కొత్త సెక్రటేరియేట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 27లోపు కొత్త భవనం నిర్మాణ శంకుస్థాపన  చేసేందుకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సెక్రటేరియేట్ లో ఉన్న నాలుగు బ్లాక్ లు కూల్చివేసి కొత్త సెక్రటేరియేట్ నిర్మించనున్నారు. దీనిపై రెండు  రోజుల్లో జరిగే కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్త భవనం నిర్మించేవరకు ఏపీకి కేటాయించిన సచివాలయంనుంచి పరిపాలన జరగనుంది.

అటు ఏపీకి కేటాయించిన భవనాలు 4 రోజుల్లోగా అప్పగించనున్నారు ఏపీ అధికారులు. సీఎస్ జోషితో సమావేశమైన తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

సెక్రటేరియేట్ భవనాలను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ కి.. అసెంబ్లీ భవనాలను అసెంబ్లీ కార్యదర్శికి.. ఎమ్మెల్యేల క్వార్టర్లను ఎస్టేట్ ఆఫీసర్లకు అప్పగించనున్నారు.

సెక్రటేరియట్ మొదలైన భవనాల అప్పగింత

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో ఉన్న సామాగ్రిని అమరావతికి తరలిస్తున్నారు AP GAD అధికారులు. AP ప్రభుత్వ సమ్మతితో సెక్రటేరియట్ భవనాలను తెలంగాణ రాష్ట్రానికి అప్పగించాలని గవర్నర్ నిర్ణయించడంతో సామాగ్రిని ఏపీకి తరలిస్తున్నారు అధికారులు.