త్వరలో కొత్త సిరీస్ రూ.100 నోట్లు

త్వరలో కొత్త సిరీస్ రూ.100 నోట్లు

కొత్త సిరీస్ తో ఉన్న వందరూపాయల నోట్లను త్వరలో చెలామణిలోకి తీసుకువస్తున్నట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) తెలిపింది. దీనికి సంబంధించి మంగళవారం ఒక ప్రకటన చేసింది.

సరికొత్తగా వచ్చే వంద నోట్లపై గాంధీ ఫోటోతో పాటు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉండనుందని తెలిపింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.100 నోట్లు యథావిధిగా కొనసాగుతాయని RBI తెలిపింది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.2000, రూ.500, రూ.200, రూ.100, రూ.50,రూ.10 కొత్త నోట్లను RBI విడుదల చేసింది.