
- ప్రెసిడెంట్గా మురళీధర్ గౌడ్, జనరల్ సెక్రటరీగా రచ్చ మురళి
హైదరాబాద్, వెలుగు: ప్రైమరీ స్కూల్స్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ (పీఎస్హెచ్ఎంఏ) నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బి. మురళీధర్ గౌడ్ (గద్వాల్), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రచ్చ మురళి (నిజామాబాద్), గౌరవ అధ్యక్షుడిగా నరేందర్ రెడ్డి (మెదక్) ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో పీఎస్ హెచ్ఎంఏ రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. అసోసియేట్ ప్రెసిడెంట్లుగా అంకం నరేశ్ (నిజామాబాద్), కొడపర్తి సోమయ్య (యాదాద్రి), బత్తుల సదానందం (హన్మకొండ), బి. రాజ్ కుమార్ (కామారెడ్డి) ఎన్నికయ్యారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డి. మోహన్, వి. గాలయ్య , బి. హన్మంతరావు , కె. లక్ష్మణ స్వామి, కె. రాజశేఖర్ రెడ్డి , పి. అంజయ్య , ఎల్. రమేశ్ నాయక్ , నర్సింగరావు, పి. చంద్రశేఖర్, ఎస్. కిషన్ ఎంపికయ్యారు. ఉమెన్స్ వైస్ ప్రెసిడెంట్లుగా లక్ష్మీతులసి, కమల, భాగ్యరేఖ ఎన్నికయ్యారు. ఫైనాన్స్ సెక్రటరీలుగా కోట శ్రవణ్ కుమార్, గాలయ్యను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మురళీధర్ గౌడ్, రచ్చ మురళి మాట్లాడుతూ.. ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రైమరీ స్కూళ్ల బలోపేతం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు.