నిజాయితీ పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త ట్యాక్స్ స్కీమ్

నిజాయితీ పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త ట్యాక్స్ స్కీమ్

న్యూఢిల్లీ:స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సరికొత్త ట్యాక్స్ స్కీమ్‌‌‌ ను లాంఛ్ చేస్తున్నారు. ‘ట్రాన్స్‌పరెంట్ ట్యాక్సేషన్ఆనరింగ్ ది హానెస్ట్’ పేరుతో ఈ ట్యాక్స్ స్కీమ్‌‌‌‌ను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్సిం గ్ ద్వారా ప్రవేశపెడుతున్నట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ ఈవెంట్‌‌‌‌కి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ట్రేడ్ అసోసియేషన్స్, ఛార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్స్, ప్రముఖ ట్యాక్స్ పేయర్లు, ఐటీ డిపార్ట్ ‌‌‌‌మెంట్ అధికారులు, ఆఫీసర్లు పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థికర్థి మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ అఫైర్స్ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌లు కూడా ఈ ఈవెంట్‌‌‌‌లో హాజరుకానున్నారు. కరోనాతో ప్రభావితమైన ఎకానమీని తిరిగి నిర్మించాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ క్రమంలో భాగంగానే కంప్లియెన్స్‌ను సరళతరం చేయడంతో పాటు, నిజాయితీ పన్ను చెల్లింపుదారుల కోసం తర్వాత దశ డైరెక్ట్ ట్యాక్స్ సంస్కరణలను చేపట్టనున్నట్టు మోడీ చెప్పారు.

అయితే ఈ సంస్కరణల వివరాలను వెల్లడించనప్పటికీ, గత ఆరేళ్ల‌లో డైరెక్ట్ ట్యాక్స్‌‌‌‌ల్లో చేపట్టిన సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తోంది. పన్ను చెల్లింపుదారులు జాతి నిర్మాతలని నిర్మలా సీతారామన్ కొనియాడారు. ప్రభుత్వం వారికి అన్ని రకాల హక్కుల కల్పిస్తుం దన్నారు. ఈ కరోనా కాలంలో ప్రజలకు ఉచితంగా ఆహారం అందించేందుకు సాయం చేస్తోన్న నిజాయితీ పన్నుచెల్లింపుదారులకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నట్టు మోడీ అన్నారు. ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఆహారం అందిస్తుందంటే..అది రెండు రకాల వ్యక్తుల వల్లే సాధ్యమవుతుందని, వారికి తాను కృతజ్ఞతలు చెబుతున్నట్టు తెలిపారు. వారిలో ఒకరు రైతులు, రెం డో వారు పన్ను చెల్లింపుదారులని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇటీవల పలు పన్ను సంస్కరణలను కూడా ప్రవేశపెట్టింది.