ఇంటర్ ఫస్టియర్లో కొత్త పుస్తకాలు..

ఇంటర్ ఫస్టియర్లో కొత్త పుస్తకాలు..
  • రిపిటేషన్  పాఠాల తొలగింపు 
  • తెలుగు పుస్తకాల్లో తెలంగాణ యాస, సంస్కృతికి పెద్దపీట
  • ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌లో ఏఐ.. మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌లో గణిత శాస్త్రవేత్తల ఇంట్రడక్షన్
  • సైన్స్ సబ్జెక్టుల్లో ఎన్‌‌‌‌‌‌‌‌సీఈఆర్‌‌‌‌‌‌‌‌టీ సిలబస్​కు అనుగుణంగా మార్పులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్​ఫస్టియర్ సిలబస్​ను ఇంటర్ బోర్డు సమూలంగా ప్రక్షాళన చేసింది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు దీటుగా సిలబస్‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేపట్టింది. అన్ని సబ్జెక్టుల్లో రిపిటేషన్ పాఠాలనూ తీసేశారు. కేవలం పాఠ్యాంశాలను మార్చడమే కాకుండా, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా పరీక్షా విధానంలోనూ మార్పులు చేశారు. పుస్తకాలను ఆకర్షణీయమైన రంగుల్లో, డిజిటల్ క్యూఆర్ కోడ్లతో ముస్తాబు చేసింది. ప్రధానంగా సైన్స్ విద్యార్థులకు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో అత్యాధునిక అంశాలను జోడించింది. కేవలం థియరీకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక పాఠాలకు, ఇంటర్నల్స్ కూ పెద్దపీట వేస్తూ కొత్త విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులను అమలు చేయనుంది. కొత్త పుస్తకాలు ఇప్పటికే కాలేజీలకు చేరుకోగా జూన్1న విద్యార్థులకు 
అందించనున్నారు. 

  • ఏఐ పాఠాలు.. మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌లో మార్పులు.. 

సైన్స్ విద్యార్థులకు అత్యాధునిక అంశాలను సిలబస్‌‌‌‌‌‌‌‌లో చేర్చారు. కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులను పూర్తిగా ఎన్‌‌‌‌‌‌‌‌సీఈఆర్‌‌‌‌‌‌‌‌టీ ప్రమాణాలకు అనుగుణంగా మార్చారు. ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌లో ఏఐ ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే కొత్త పాఠాన్ని యాడ్ చేశారు. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి అంశాలను వివరించారు. మ్యాథ్స్-ఏలో సెట్స్ అండ్ రిలేషన్స్, సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అనే రెండు కీలక చాప్టర్లను కొత్తగా చేర్చారు. మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌లో పదే పదే వచ్చే అంశాలను తొలగించి, పుస్తకం పేజీల సంఖ్యను తగ్గించారు. జువాలజీలో ఎకనామిక్ జువాలజీ అనే కొత్త చాప్టర్ రాగా, బాటనీ, కెమిస్ట్రీలను పూర్తిగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా మార్చారు. 

  • తెలంగాణ యాస..

తెలుగు సబ్జెక్టులో రాష్ట్ర సంస్కృతికి పెద్దపీట వేశారు. తెలంగాణ చరిత్ర, పండుగలు, మాండలికం(యాస), స్థానిక సంప్రదాయాలను ప్రతిబింబించేలా పాఠాలను రూపొందించారు. భాషా సబ్జెక్టులు (తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం తదితర), హ్యుమానిటీస్ (ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్)లో 20 మార్కుల ఇంటర్నల్ అసెస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టారు. పొలిటికల్ సైన్స్ పుస్తకం ఆరంభంలో విద్యార్థులకు కెరీర్ అవకాశాలను వివరించారు. హిస్టరీ పాఠాలను పరిశోధనాత్మక కోణంలో, మ్యాపులు, చిత్రాలతో ఆకర్షణీయంగా మార్చారు. 

  • సిలబస్ తగ్గింపు.. ప్రాక్టికల్ రిఫార్మ్స్ 

 జియోగ్రఫీలో విద్యార్థుల భారం తగ్గించేందుకు సిలబస్‌‌‌‌‌‌‌‌ను కేవలం 6 యూనిట్లు, 18 చాప్టర్లకే పరిమితం చేశారు. ఫిజిక్స్ ప్రాక్టికల్స్‌‌‌‌‌‌‌‌లో ప్రయోగాల సంఖ్యను 10కి తగ్గించి, మొదటి ఏడాది నుంచే 15 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేలా మార్పులు చేశారు. ప్రతీ పుస్తకంలోనూ డిజిటల్ కంటెంట్ కోసం క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేశారు. మ్యాథ్స్​లో విద్యార్థుల్లో కుతూహలం పెంచేందుకు ‘డూ యూ నో’ బాక్సులు, భారతీయ శాస్త్రవేత్తల చిత్రాలు, వారి గొప్పతనాన్ని వివరించే అంశాలను పుస్తకాల్లో చేర్చారు.