స్టాప్‌ లైన్స్‌ దాటితే వాహనదారులపై కఠిన చర్యలు

స్టాప్‌ లైన్స్‌ దాటితే వాహనదారులపై కఠిన చర్యలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీసుల కొత్త రూల్స్‌ తీసుకొచ్చారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి ‘ఆపరేషన్ రోప్’ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. సిగ్నల్స్‌ దగ్గర వాహనదారులు స్టాప్‌ లైన్స్‌ దాటితే ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోనున్నారు. సిగ్నల్స్‌ స్టాప్‌ లైన్‌ దాటి ముందుకెళ్తే రూ.100 జరిమానా విధించనున్నారు. ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్‌ చేస్తే రూ.1000 జరిమానా. ఫుట్‌పాత్‌లపై దుకాణదారులు వస్తువులు పెడితే భారీగా జరిమానా విధించనున్నారు.

పాదచారులకు ఆటంకం కలిగేలా వాహనాలను పార్కింగ్‌ చేస్తే రూ.600 ఫైన్‌ వేయనున్నారు. అలాగే.. నో పార్కింగ్ ప్లేస్ లో వెహికిల్స్ పార్క్ చేస్తే.. టోవింగ్ వెహికిల్ ద్వారా ట్రాఫిక్ పోలీసులు పీఎస్ లకు తరలించనున్నారు. బైక్ నో పార్కింగ్ ఫైన్ 100 రూపాయలతో పాటు.. అదనంగా టోవింగ్ చార్జీ రూ.200 వసూలు చేయనున్నారు. ఇక కారు నో పార్కింగ్ ఫైన్ 200 రూపాయలతో పాటు అదనంగా టోవింగ్ చార్జీ రూ.600 వసూలు చేయనున్నారు.