బజాజ్ పల్సర్‌‌‌‌ ఎన్‌‌ఎస్‌‌ 400 జెడ్‌‌లో కొత్త వేరియంట్

బజాజ్ పల్సర్‌‌‌‌ ఎన్‌‌ఎస్‌‌ 400 జెడ్‌‌లో కొత్త వేరియంట్

బజాజ్ ఆటో  బజాజ్ పల్సర్ ఎన్‌‌ఎస్‌‌400జెడ్‌‌ లో 2025  ఎడిషన్‌‌ను రూ.1.92 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. ఈ బైక్‌‌ను కిందటేడాది మేలో మొదటిసారిగా రూ.1.85 లక్షల ధరతో పరిచయం చేశారు.  

ఇప్పటివరకు 20 వేల యూనిట్లు అమ్మామని కంపెనీ చెబుతోంది.   ఈ బైక్  టాప్ స్పీడ్ 157 కి.మీ/గం (పాత వెర్షన్‌‌లో 150 కి.మీ/గం). ఈ బండిలోని 373.27 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 43 పీఎస్‌‌ పవర్, 35 ఎన్‌‌ఎం టార్క్‌‌ను  ఉత్పత్తి చేస్తుంది. ఇందులో  6 గేర్లు ఉంటాయి.