నయా సాల్.. నయా జోష్

నయా సాల్.. నయా జోష్

గతానికి బైబై చెప్పి.. అంబరాన్నంటే సంబురాలతో న్యూఇయర్ వచ్చేసింది.. 

ప్రపంచానికి పండుగ తెచ్చింది.. పిల్లాపెద్దను వేడుకల్లో ముంచెత్తింది. యువతలో జోష్ నింపింది.. పటాకుల మెరుపులు.. డీజేల మోతలు.. ఆటపాటలతో దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్ మిన్నంటాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో జరంత ముందే సెలబ్రేషన్స్ షురూ కాగా.. మన దగ్గర శనివారం సాయంత్రం నుంచే మొదలైన సందడి అర్ధరాత్రి దాటాక హోరెత్తింది. ‘1.. 2.. 3.. హ్యాపీ న్యూఇయర్’ అంటూ కోట్ల గొంతుకలు కొత్త ఏడాదికి ఆహ్వానం పలికాయి. 

ఇయర్ ఎండ్‌‌కు వీకెండ్‌‌ కూడా కలిసి రావడంతో జోష్ రెట్టింపు అయింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ప్రఖ్యాత ఒపేరా హౌస్, హార్బర్ బ్రిడ్జిపై జరిగిన సెలబ్రేషన్స్ ఎప్పటిలానే ఆకట్టుకున్నాయి. ఆకాశంలో ముగ్గులేసిన రంగురంగుల ఫైర్ క్రాకర్లు.. న్యూఇయర్ వేడుకలకు కొత్త వెలుగులను తీసుకొచ్చాయి.