రాజ్ భవన్‌లో ఘనంగా కొత్త ఏడాది వేడుకలు

రాజ్ భవన్‌లో ఘనంగా  కొత్త ఏడాది వేడుకలు

రాజ్ భవన్‌లో కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూ ఇయర్ సందర్భంగా గవర్నర్ తమిళి సై రాజభవన్ లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత చీరలను ప్రదర్శనలో ఉంచారు. 2023 సంవత్సరం అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. కరోనా కాలంలోనూ అందరం సంతోషంగా ఉన్నామంటే అది కేవలం మనం తీసుకున్న జాగ్రత్తలు వల్లేనని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రజలకు ఈ ఏడాది అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా సందర్భంగా కోరుకున్నారు. ఎకానమీ, లైవ్ హుడ్  తో  దేశం ముందుకు పోతుందని చెప్పారు. రూ. 81 కోట్ల మందికి ఉచిత ఆహారాన్ని అందిస్తున్నామని, ఆకలితో ఎవ్వరూ ఇబ్బంది పడొద్దన్నారు, కేవలం వ్యాక్సినేషన్, మెడిసిన్స్ ద్వారానే 45 లక్షల మందిని కొవిడ్ కాలంలో బ్రతికించుకున్నామని మెడికల్ మ్యాగ్జిన్ ప్రకటించిందని చెప్పారు. అయితే ఈ వేడుకకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, పోలీసులు ఉన్నతాధికారులెవరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. 

https://youtu.be/_c5TJnvDVjM