హైదరాబాద్లో న్యూఇయర్ జోష్ మొదలైంది

హైదరాబాద్లో న్యూఇయర్ జోష్ మొదలైంది

హైదరాబాద్లో న్యూఇయర్ జోష్ మొదలైంది. క్లబ్,పబ్లలో ఇప్పటికే రద్దీ ఏర్పడింది. డీజేస్టెప్పులు, స్సెషల్ ప్రోగ్రామ్స్తో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. సిటీలో దాదాపు 100కుపైగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నగరశివారులో ఇప్పటికే ఈవెంట్స్ మొదలయ్యాయి. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయిస్తున్నారు..

వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.. గీతదాటితే చర్యలు తప్పవనిహెచ్చరిస్తున్నారు.. రాత్రి ఒంటిగంట తర్వాత వేడుకలొద్దని సూచిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు పోలీసులు.

న్యూఇయర్ వేడుకలకు రెడీ అయ్యారు జనం. ఈ వేడుకల్లో లిక్కర్ దే కీ రోల్ ఉంటుంది.  వైన్స్ ముందు జనం క్యూ కట్టారు. ఇవాళ, రేపు రికార్డు స్థాయిలో మద్యం కొనుగోళ్లు జరిగే అవాకశం ఉంది. ఒక్క కౌంటర్ కు 20 నుంచి 25 లక్షల బిజినెస్ జరిగే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. న్యూఇయర్  సందర్భంగా అర్థరాత్రి 12 గంటల వరకే వైన్స్ కు పర్మిషన్ ఉంది. ఒంటి గంట వరకు బార్లు ఓపెన్ ఉండనున్నాయి. ఇక సిటీ అంతటా డ్రంక్ డ్రైవ్ నిర్వహించనున్నారు పోలీసులు.