
హైదరాబాద్, వెలుగు: న్యూ ఇయర్ సందర్భంగా రాజ్ భవన్ లో సోమవారం గవర్నర్ తమిళిసై ఓపెన్ హౌస్ నిర్వహిం చనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల వరకు రాజ్ భవన్ కు వచ్చి విషెస్ చెప్పొచ్చని శనివారం పత్రిక ప్రకటనలో తెలిపారు. రాజ్ భవన్ కు వచ్చే వాళ్లు పూల బొకేలు, శాలువాలు తీసుకు రావొద్దని చెప్పారు. పుస్తకా లతో పాటు ఇతర వస్తువులను తీసుకొస్తే స్టూడెంట్స్ కు అందజేస్తామని గవర్నర్ పేర్కొన్నారు.