వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఘనంగా దీపావళి సంబురం

వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఘనంగా దీపావళి సంబురం

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దీపావళి థీమ్ తో యానిమేషన్ ప్రదర్శించారు. హడ్సన్ నదిపై కళ్లు చెదిరేలా ఫైర్ వర్క్స్ ఏర్పాటు చేశారు. ఇక వాషింగ్టన్ లో జరిగిన వేడుకల్లో అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ పాల్గొన్నారు. దీపం వెలిగించి వేడుకలు ప్రారంభించారు. చికాగోకు చెందిన కాంగ్రెస్ మెన్ డ్యానీ డేవిస్ వేడుకలు నిర్వహించారు.