హామిల్టన్: ఛేజింగ్‌లో మార్క్ చాప్‌మన్ (64), బ్రేస్‌వాల్ (40 నాటౌట్) చెలరేగడంతో శనివారం జరిగిన మూడో వన్డేలోనూ న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. టాస్ గెలిచిన విండీస్ 36.2 ఓవర్లలో 161 రన్స్‌కు ఆలౌటైంది. రోస్టన్ ఛేజ్ (38) టాప్ స్కోరర్. జాన్ క్యాంప్‌బెల్ (26), ఖారీ పియరీ (22 నాటౌట్), రూథర్‌ఫోర్డ్ (19), అకీమ్ అగస్టీ (17) ఫర్వాలేదనిపించారు.
మ్యాట్ హెన్రీ 4, జాకబ్ డఫీ, శాంట్నర్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత న్యూజిలాండ్ 30.3 ఓవర్లలో 162/6 స్కోరు చేసింది. డేవన్ కాన్వే (11), రాచిన్ రవీంద్ర (14), విల్ యంగ్ (3), టాప్ లాథమ్ (10) నిరాశపర్చినా.. చాప్‌మన్, బ్రేవ్‌వాల్ ఐదో వికెట్‌కు 75 రన్స్ జోడించి గెలిపించారు. మాథ్యూ ఫోర్డ్, జైడెన్ సీల్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హెన్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, జెమీసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
