న్యూజిలాండ్ లో మళ్లీ కరోనా కేసులు..  సాధారణ ఎన్నికలు వాయిదా

న్యూజిలాండ్ లో మళ్లీ కరోనా కేసులు..  సాధారణ ఎన్నికలు వాయిదా

కరోనాను పూర్తిగా కట్టడి చేసిన మొట్ట మొదటి దేశంగా న్యూజిలాండ్ రికార్డ్ సృష్టించింది. అయితే అది ఎంతో కాలం నిలవలేదు. దాదాపు 102 రోజుల తర్వాత ఆ దేశంలో మళ్లీ కరోనా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల జరగాల్సిన సాధారణ ఎన్నికలను నాలుగు వారాల పాటు వాయిదా వేశారు.

సెప్టెంబర్ 19న ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆ ఎన్నికలను అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేశారు. ఓటర్లు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు జసిండా. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాతే  ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా కారణంగా ఆక్లాండ్ లో లాక్ డౌన్ విధిస్తున్నామని చెప్పారు.

మూడు నెలల క్రితం న్యూజిలాండ్ ను కరోనా రహిత దేశంగా జసిండా ప్రకటించారు.