గాంధీ నగర్: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో బ్యాటింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా బౌలింగ్‌లో కూడా సత్తా చాటుతోంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేస్తోంది. దీంతో 256 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన న్యూజిలాండ్ 8.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయింది.
ఓపెనర్ సీఫెర్ట్ ఒక్కడే (52) హాఫ్ సెంచరీతో ప్రతిఘటించాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (9) తీవ్రంగా నిరాశపర్చాడు. కీలకమైన ఫైనల్ మ్యాచులో కివీస్ మిడిల్ ఆర్డర్ కూడా కుప్పకూలింది. రచిన్ రవీంద్ర (1), గ్లె్న్ ఫిలిప్స్ (5), చాప్మన్ (3) అట్టర్ ఫ్లాప్ అయ్యారు.
భారత బౌలర్లో అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టగా.. హార్ధిక్ పాండ్యా, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో మిచెల్ శాంట్నర్ (10), డారెల్ మిచెల్ (2) ఉన్నారు. కివీస్ సగం వికెట్లు కోల్పోవడంతో దాదాపు ఇండియా విజయం ఖరారు అయ్యింది. కొన్ని చోట్ల అభిమానులు అప్పుడు విజయోత్సవాలు మొదలుపెట్టారు.
