ఐపీఎల్​ హోస్టింగ్​కు మేమూ రెడీ!

ఐపీఎల్​ హోస్టింగ్​కు  మేమూ రెడీ!

ఓవైపు కరోనా విజృంభణ.. మరోవైపు పోస్ట్​పోన్​ దిశగా టీ20 వరల్డ్​కప్..ఈ నేపథ్యంలో ఐపీఎల్​కు సిద్ధమవుతున్న బీసీసీఐ. మెగా ఈవెంట్​పై ఐసీసీ తీరు ఎలా ఉన్నా.. లీగ్​ విషయంలో ఇండియన్​ బోర్డుకు మద్దతు పెరిగిపోతుంది. ఇండియాలో లీగ్​ సాధ్యం కాకపోతే.. హోస్టింగ్‌‌‌‌కు మేం రెడీ అంటూ పలు క్రికెట్‌‌‌‌ బోర్డులు పోటీపడుతున్నాయి. తాజాగా న్యూజిలాండ్​ రేస్‌‌‌‌లోకి రావడంతో.. పోటీలో నిలిచిన దేశాల సంఖ్య మూడుకు చేరింది. బీసీసీఐ ఎవర్ని ఎంచుకుంటుందో చూడాలి..!!

న్యూఢిల్లీ:మొన్న యూఏఈ… నిన్న శ్రీలంక… నేడు న్యూజిలాండ్​.. ఐపీఎల్​కు హోస్టింగ్​ ఇస్తామని ముందుకొచ్చిన దేశాలివి. మెగా లీగ్​పై బీసీసీఐ ఇంకా నిర్ణయం ప్రకటించకపోయినా.. ఇతర దేశాలు మాత్రం టోర్నీ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నాయి. ఇది బీసీసీఐకి బూస్టింగ్​ ఇచ్చే విషయమే అయినా.. లీగ్​ను ఇండియాలో నిర్వహించాలా? విదేశాలకు తరలించాలా? అనే అంశంపైనే ఇప్పుడు ఇండియన్​ బోర్డు మల్లగుల్లాలు పడుతున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాలో ఐపీఎల్​ నిర్వహణ కత్తిమీద సామే. ఎందుకంటే రోజురోజుకు కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతున్నది. దీంతో ఒకే ప్రదేశంలో లీగ్​ను నిర్వహించాలన్నా.. లాజిస్టిక్​ సమస్యలు వస్తాయి. అయితే ఐపీఎల్​ విండో అనుకుంటున్న  సెప్టెంబర్​, నవంబర్​లో పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పడం అసాధ్యం. కాబట్టి కొన్ని మ్యాచ్​లు ఇక్కడ మరికొన్ని మ్యాచ్​లు వేరే దగ్గర నిర్వహించేలా ఏమైనా ప్లాన్‌‌‌‌‌‌‌‌​ చేస్తారేమో చూడాలి. ఐపీఎల్​పై ఫుల్​ క్లారిటీ రావాలంటే.. ముందు టీ20 వరల్డ్​కప్​పై ఐసీసీ ఫైనల్ డెసిషన్​ వెల్లడించాలి. దానిని బట్టి మిగతా బోర్డులు ఎలా స్పందిస్తాయో చూసి మెగా లీగ్​పై తుది అంచనాకు రావొచ్చు.

ఫ్రంట్​ రన్నర్​ యూఏఈ

కివీస్ రేస్​లోకి వచ్చినా.. టైమింగ్​ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇండియాకు, కివీస్​కు ఏడున్నర గంటలు టైమ్​ డిఫరెన్స్​ఉంది. మధ్యాహ్నం 12.30 గంటలకు మ్యాచ్​ను ప్రారంభించినా.. ఆ టైమ్​లో చాలా మంది ఆఫీస్​ల్లో ఉంటారు. వర్క్​ ఫ్రమ్​ హోమ్​ చేసే వాళ్లు కూడా యాక్షన్​ను మిస్ అవుతారు. దీనిపై బోర్డు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక హామిల్టన్​, ఆక్లాండ్​ను మినహాయిస్తే.. వెల్లింగ్టన్​, క్రైస్ట్​చర్చ్​, నేపియర్​, డునెడిన్​ ప్రాంతాలను రోడ్​మార్గాల ద్వారా కవర్​ చేయడం సానుకూలాంశం. ఇక లంకది కాస్ట్​ ఎఫెక్టివ్​ ఆప్షన్​. అక్కడ దాదాపు ఇండియాలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో యూఏఈ లీగ్ నిర్వహణ రేస్​లో టాప్​ ప్లేస్​లో ఉంది.

ఎక్కడైనా ఫుల్​ టోర్నీ..!

ఇంతవరకు మ్యాచ్​ల సంఖ్యను కుదిస్తారని వార్తలు వచ్చినా దీనికి నిర్వాహకులు సుముఖంగా లేరని తెలుస్తోంది. లంక, యూఏఈ, కివీస్​… టోర్నీని ఎక్కడ నిర్వహించినా సరే ఫుల్ షెడ్యూల్​ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ మూడు దేశాల్లో స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతి ఇస్తున్నారు. ఇది మరింత జోష్​ పెంచే అంశం. అలాంటి టైమ్​లో మ్యాచ్​లు తగ్గిస్తే లీగ్​ కళ తప్పుతుందని గవర్నింగ్​ కౌన్సిల్ అభిప్రాయం. ప్రతి టీమ్​ క్వారంటైన్​లో ఉండటం కంపల్సరీ కాబట్టి కచ్చితంగా ఫుల్​ టీమ్స్​తో, ఫుల్​ షెడ్యూల్​లోనే ఐపీఎల్​ జరుగుతుందని నిర్వాహకులు నమ్మకంతో ఉన్నారు.

కౌన్సిల్​ మీట్‌‌‌‌‌‌‌‌తో క్లారిటీ

ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ రావాలంటే ముందు గవర్నింగ్​ కౌన్సిల్​ మీటింగ్​ జరగాలి. రెండు వారాల కిందటే అనుకుంటే గల్వామా ఘటన నేపథ్యంలో వాయిదా పడింది. అయితే అతి త్వరలోనే ఈ మీటింగ్​ ఉంటుందని బీసీసీఐ అఫీషియల్​ వెల్లడించాడు. ‘మా సమావేశంలో ప్రధానంగా ఐపీఎల్​, వివో స్పాన్సర్​షిప్​పైనే చర్చ జరుగుతుంది. అప్పుడు లీగ్​ఇక్కడా, బయటా అనే దానిపై క్లారిటీ వస్తుంది. ఆ లోపు ఐసీసీ కూడా ఏదో ఒకటి తేలుస్తుంది. కాబట్టి రాబోయే రెండు, మూడు వారాల్లో కీలక నిర్ణయాలు జరుగుతాయి’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

కివీస్​ ఓకేనా..?

ఇండియాతో పోలిస్తే ఇతర దేశాల్లో కరోనా వ్యాప్తి  కాస్త తక్కువగా ఉంది. కాబట్టి లీగ్​ను వేరే దేశంలో నిర్వహిస్తే బెటర్​ అని బోర్డులో ఓ వర్గం భావిస్తోంది. శ్రీలంక, యూఏఈతో పాటు న్యూజిలాండ్​ కూడా హోస్టింగ్​కు ముందుకు రావడంతో బీసీసీఐ ఎటువైపు మొగ్గుతుందా? అనేది ఆసక్తికరం. ప్రస్తుతం లంక, యూఏఈతో పోలిస్తే కరోనా కట్టడిలో న్యూజిలాండ్​ చాలా ముందుంది.  కొన్ని రోజులుగా అక్కడ పాజిటివ్​ కేసులు లేవు. కాబట్టి కివీస్​ వెళ్తే ఎలా ఉంటుందనే  దానిపై బోర్డు దృష్టి సారించింది. ‘ఇండియాలో లీగ్​ను నిర్వహించడమే మా ఫస్ట్‌‌‌‌ చాయిస్​. ఇక్కడ సేఫ్​ కాదని తేలితేనే ఓవర్​సీస్​ గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు న్యూజిలాండ్ కూడా ముందుకొచ్చింది. అక్కడ పరిస్థితులూ అనుకూలంగానే ఉన్నాయి. టీమ్స్​, బ్రాడ్‌‌‌‌కాస్టర్స్‌‌‌‌,స్టేక్ హోల్డర్లతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాం.ప్లేయర్ల సేఫ్టీ విషయంలో రాజీ పడం’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.

 

కోహ్లీపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు