ఆవుల తేన్పు, మూత్రంపై ట్యాక్స్​ 

ఆవుల తేన్పు, మూత్రంపై ట్యాక్స్​ 

ఆవులు, గొర్రెల అపాన వాయువు(గ్యాస్​), తేనుపు, మూత్రంపై ట్యాక్స్​ వేయబోతోంది న్యూజిలాండ్​ ప్రభుత్వం! దానికో కారణం ఉంది. గ్రీన్​హౌస్​ ఎమిషన్స్​కు ​ఆవులు, గొర్రెల తేన్పు, గ్యాస్​, మూత్రం​ కూడా కారణమేనని సర్వేలు చెప్తున్నాయి కదా. అందుకే వాటిని తగ్గించడానికి ఈ ట్యాక్స్​ వేస్తున్నట్లు న్యూజిలాండ్​ గవర్నమెంట్​ చెప్తోంది.

అయితే, ఈ నిర్ణయంపై అక్కడి రైతులు మండిపడుతున్నారు. ఎందుకంటే న్యూజిలాండ్​లో పశువులు, గొర్రెల పెంపకం బాగా ఎక్కువ. అక్కడివాళ్లకు ఎక్కువ ఆదాయం తెచ్చేది అవే. మరో విశేషం ఏంటంటే న్యూజిలాండ్​ జనాభా 50 లక్షలు అయితే... ఆవులు, బర్రెల సంఖ్య కోటి. గొర్రెలైతే ఏకంగా 2కోట్ల 60లక్షలు ఉన్నాయి.