టెస్టులకు వాగ్నర్‌‌‌‌ గుడ్‌‌‌‌బై

టెస్టులకు వాగ్నర్‌‌‌‌ గుడ్‌‌‌‌బై

వెల్లింగ్టన్‌‌‌‌ : న్యూజిలాండ్‌‌‌‌ పేసర్‌‌‌‌ నీల్‌‌‌‌ వాగ్నర్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు వీడ్కోలు పలికాడు. గురువారం నుంచి ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టుకు అతను అందుబాటులో ఉండటం లేదు. 2012లో టెస్ట్ ఆరంగేట్రం చేసిన వాగ్నర్‌‌‌‌.. ఇప్పటి వరకు ఆడిన 64 మ్యాచ్‌‌‌‌ల్లో 37 యావరేజ్‌‌‌‌తో 260 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా కివీస్‌‌‌‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌‌‌‌గా రికార్డులకెక్కాడు. 2022లో కివీస్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ గెలవడంలో వాగ్నర్‌‌‌‌ కీలక పాత్ర పోషించాడు.

2008లో సౌతాఫ్రికా నుంచి కివీస్‌‌‌‌కు వచ్చిన వాగ్నర్‌‌‌‌.. ఒటాగో ప్రావిన్స్‌‌‌‌ తరఫున నాలుగేళ్ల పాటు ఫస్ట్‌‌‌‌ క్లాస్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఆడాడు. ‘ఇదో ఎమోషన్ల్ వీక్. ఆటకు గుడ్‌‌‌‌బై చెప్పడం అంత ఈజీ కాదు. కానీ ఈ టీమ్‌‌‌‌ను కొత్త వాళ్లు ముందుకు తీసుకెళ్లడానికి టైమ్‌‌‌‌ వచ్చింది. నేను బ్లాక్‌‌‌‌ క్యాప్స్‌‌‌‌ కోసం టెస్ట్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. జట్టుగా మేం సాధించిన ప్రతిదానికి గర్వపడుతున్నా’ అని వాగ్నర్‌‌‌‌ కన్నీటి పర్యంతమయ్యాడు.