అ దేశంలో 100 రోజులుగా ఒక్క క‌రోనా కేసు న‌మోదు కాలేదు

అ దేశంలో 100 రోజులుగా ఒక్క క‌రోనా కేసు న‌మోదు కాలేదు

క‌రోనా వైర‌స్ తో ప్ర‌పంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. కానీ న్యూజిలాండ్ లో మాత్రం గ‌త కొన్ని రోజులుగా ఒక్క క‌రోనా కేసులేద‌ని తెలుస్తోంది. 50ల‌క్ష‌ల ప్ర‌పంచ జ‌నాభా ఉన్న న్యూజిల్యాండ్ లో ఫిబ్ర‌వ‌రిలో 1,219కేసులు న‌మోద‌య్యాయి. కానీ ఆ దేశం కరోనాను విజయవంతంగా అదుపు చేసింది. మార్చి 19 నుంచే ఆ దేశం విదేశాల నుంచి వచ్చేవారికి గేట్లను మూసేసింది. వైర‌స్ వ్యాప్తిని అరికట్టేలా అన్నీ ర‌క‌లా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చే వారికి క్వారంటైన్ చేశారు. దీంతో అక్కడ కరోనా ప్రభావం పూర్తిగా తగ్గింది.

గత 100 రోజులుగా ఆ దేశంలో మళ్లీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అక్కడి వైద్య అధికారులు వెల్లడించారు. ఈ విషయమై హెల్త్ డైరెక్టర్ జనరల్ యాష్లే బ్లూమ్‌ఫీల్డ్ మాట్లాడుతూ.. దేశంలో గత 100 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. 100 రోజుల పాటు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకుండా చూసుకోవడం గొప్ప విషయమే. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మేము అలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.