క్రైస్ట్‌చర్చ్: వెస్టిండీస్‌తో మంగళవారం మొదలైన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో తడబడింది. ఏడాది తర్వాత టెస్ట్‌ల్లో రీ ఎంట్రీ ఇచ్చిన మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (52) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా మిగతావారు నిరాశపర్చారు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 231/9 స్కోరు చేసింది. జాక్ ఫౌల్కేస్ (4 బ్యాటింగ్), జాకబ్ డఫీ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
కాన్వే (0) డకౌటవగా.. రచిన్ రవీంద్ర (3), విల్ యంగ్ (14) నిరాశపరిచారు. లాథమ్ (24), టామ్ బ్లండెల్ (29) మోస్తరుగా ఆడారు. 148/6 స్కోరుతో కష్టాల్లో పడిన కివీస్‌ను బ్రేస్‌వెల్ (47), నేథన్ స్మిత్ (23) ఏడో వికెట్‌కు 52 రన్స్ జత చేసి నిలబెట్టారు. కీమర్ రోచ్, ఓజే షీల్డ్స్, జస్టిన్ గ్రీవ్స్ తలో రెండు వికెట్లు తీశారు.
