న్యూ ఇయర్‭కు వెల్ కమ్.. న్యూజిలాండ్‭లో సెలబ్రేషన్స్

న్యూ ఇయర్‭కు వెల్ కమ్.. న్యూజిలాండ్‭లో సెలబ్రేషన్స్

అందరికంటే ముందే న్యూఇయర్‭కు న్యూజిలాండ్ వెల్ కమ్ చెప్పేసింది. ఆక్లాండ్‭లో న్యూఇయర్ వేడుకలు మొదలయ్యాయి. ఆక్లాండ్ వాసులు న్యూ ఇయర్‭కు గ్రాండ్ వెల్‭కమ్ చెబుతూ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఆక్లాండ్‌ స్కై టవర్‌ వద్ద న్యూఇయర్‌ వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. బాణసంచా వెలుగులతో స్కైటవర్‌ కాంతులు వెదజల్లింది. కోవిడ్ కారణంగా రెండు సంత్సరాల పాటు న్యూ ఇయర్ వేడుకలు జరగలేదు. ఇప్పుడు గ్రాండ్‭గా 2023 వేడుకలు పార్టీలు,డీజేలతో మారుమోగుతున్నాయి. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. 

మరికొద్ది గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నారు. మరో గంటలో సిడ్నీలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకోనున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఆస్ట్రేలియాలో సర్వం సిద్ధమైంది. గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... రాబోయే సంవత్సరానికి ప్రజలు వెల్ కమ్ చెబుతున్నారు.