న్యూజిలాండ్ ఉమెన్స్ క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపులు

V6 Velugu Posted on Sep 21, 2021

ఇటీవల న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్ పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకుంది. ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇవాళ(మంగళవారం) న్యూజిలాండ్, ఇంగ్లండ్ మహిళల మూడో వన్డే కాసేట్ల జరగనుండగా ఓ ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు ఉంటున్న హోటల్ ను పేల్చివేస్తామంటూ ఈమెయిల్ ఉంది. 

న్యూజిలాండ్ జట్టు మేనేజ్ మెంట్ లోని ఓ అధికారికి ఈ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అయితే ఇంగ్లండ్, న్యూజిలాండ్ దేశాల క్రికెట్ బోర్డులు దీన్ని అంత  సీరియస్ గా పట్టించుకోలేదు. ఆ బెదిరింపు ఈమెయిల్ ఏమంత నమ్మశక్యంగా లేదని రెండు దేశాల క్రికెట్ బోర్డులు తేలిగ్గా తీసుకున్నాయి లీసెస్టర్ లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ యథావిధిగా ప్రారంభమైంది.

Tagged New Zealand, England, womens team, bomb threats

Latest Videos

Subscribe Now

More News