NZvsPAK: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్..

NZvsPAK: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్..

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్లో పాక్ జట్టుపై మొట్టమొదటిసారిగా వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది.  మూడో వన్డేలో 2 వికెట్ల తేడాతో గెలిచిన కివీస్..2-1తో సిరీస్ను దక్కించుకుని రికార్డు నెలకొల్పింది.  మరోవైపు స్వదేశంలో పాకిస్తాన్కు ఇది వరుసగా ఐదో సిరీస్ ఓటమి కావడం గమనార్హం. 

జమాన్ సెంచరీ..

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ సెంచరీ చేయగా..రిజ్వాన్ హాఫ్ సెంచరీ సాధించాడు. సల్మాన్ 43 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 45 పరుగులు చేశాడు. షాన్ మసూద్ డకౌట్ కాగా..కెప్టెన్ బాబర్ ఆజమ్ 4 పరుగులు చేసి పెవీలియన్ చేరాడు. కివీస్ బౌలర్లలో తీమ్ సౌథీ 3 వికెట్లు దక్కించుకున్నాడు. 

చెలరేగిన ఫిలిప్స్ 

281 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన న్యూజిలాండ్..48.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. డెవాన్ కాన్వే విలియమ్సన్ హాఫ్ సెంచరీలు సాధించగా..గ్లెన్ ఫిలిప్స్ 42 బంతుల్లో 63 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. సూపర్ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన ఫిలిప్స్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా..డెవాన్ కాన్వేకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. 

వరుసగా ఐదో సిరీస్ ఓటమి..

న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన పాక్కు స్వదేశంలో వరుసగా ఐదో సిరీస్ ఓటమి. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ డ్రా అయింది. అంతకుముందు ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్ను 3-0తో కోల్పోయింది. ఆసీస్తో జరిగిన టెస్టు సిరీస్లో 1-0తో ఓడిపోయింది.  దీంతో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు లేదా అంతకంటే ఎక్కువ వన్డే సిరీస్‌ను కోల్పోయిన తొలి పాక్ కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ నిలిచాడు.